సింగ‌పూర్‌ అగ్ని ప్ర‌మాదం... మార్క్ శంక‌ర్ ఫొటో విడుద‌ల‌... నెట్టింట పిక్ వైర‌ల్‌

  • సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయ‌ప‌డ్డ ప‌వ‌న్ త‌న‌యుడు మార్క్ శంక‌ర్‌
  • మ‌రో మూడు రోజుల పాటు వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ 
  • ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో మార్క్ శంక‌ర్ ను ద‌గ్గ‌రుండి చూసుకుంటున్న ప‌వ‌న్ దంప‌తులు
  • మార్క్ శంక‌ర్‌కు సంబంధించి ఆసుపత్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ లేటెస్ట్‌ ఫొటో
  • క్ష‌ణాల్లో నెట్టింట వైర‌ల్‌గా మారిన పిక్ 
సింగపూర్ పాఠ‌శాల‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయ‌ప‌డిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో కోలుకుంటున్నాడు. మ‌రో మూడు రోజుల పాటు మార్క్ వైద్యుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటాడ‌ని తెలిసింది. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో ప‌వ‌న్‌తో పాటు ఆయ‌న అర్ధాంగి అన్నా లెజ్నోవా ద‌గ్గ‌రుండి కుమారుడ్ని చూసుకుంటున్నారు.  

అయితే, తాజాగా మార్క్ శంక‌ర్‌కు సంబంధించి ఆసుపత్రి నుంచి లేటెస్ట్‌ ఫొటో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ పిక్‌లో పవన్ తనయుడు తాను క్షేమంగా ఉన్నాన‌ని సింబాలిక్‌గా చెప్ప‌డం క‌నిపిస్తోంది. ఇక‌ ఈ ఫొటో చూసిన ప‌వ‌న్ అభిమానులు కాస్త‌ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడీ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. 

కాగా, ప్ర‌మాదంలో మార్క్ శంక‌ర్‌కి కాళ్లు, చేతుల‌కు చిన్న‌పాటి గాయాలు అయ్యాయ‌ని, ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అనారోగ్యం పాల‌య్యాడ‌ని తెలిసింది. దాంతో ముందు అత్యవసర వార్డులో ఉంచి చికిత్స అందించారు. కాస్త కోలుకోవ‌డంతో ఆ త‌ర్వాత జ‌న‌ర‌ల్ వార్డుకు మార్చిన‌ట్లు తెలుస్తోంది. మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి వైద్యులు తెలిపిన‌ట్టు స‌మాచారం. 


More Telugu News