ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా టికెట్ లాంచ్ చేసిన రామ్ చరణ్

  • యాంకర్ ప్రదీప్ హీరోగా నటించిన చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి   
  • మూవీ బిగ్ టికెట్ ను లాంచ్ చేసిన రామ్‌చరణ్
  • రామ్‌చరణ్ కు ధన్యవాదాలు తెలిపిన చిత్ర బృందం
ప్రముఖ నటుడు రామ్ చరణ్ తాజాగా 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చిత్రానికి సంబంధించిన బిగ్ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది.

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సినిమా బిగ్ టికెట్ ఆవిష్కరణ కార్యక్రమానికి రామ్ చరణ్ హాజరుకావడం పట్ల చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. 


More Telugu News