మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి సిట్ నోటీసులు

  
మ‌ద్యం కుంభ‌కోణం ఆరోప‌ణ‌ల కేసులో మాజీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న విజ‌య‌వాడ సీపీ కార్యాల‌యంలో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని పేర్కొంది. వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ స్కామ్ జ‌రిగింద‌ని కూట‌మి ప్ర‌భుత్వం ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా ద‌ర్యాప్తున‌కు సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఇక మద్యం కుంభకోణంపై సిట్‌ ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోమ‌వారం సోదాలు చేసింది. హైదరాబాద్‌లోని మూడు ప్రాంతాల్లో 50 మంది సిట్‌ అధికారులు ఇందులో పాల్గొన్నారు. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి మూడుసార్లు అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజ‌రు కాలేదు. 

ఆయ‌న‌ను విచారిస్తే ఈ స్కామ్‌కు సంబంధించి కీలక విషయాలు బయటకు వచ్చే అవ‌కాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఈరోజు విజ‌య‌సాయిరెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. 


More Telugu News