ఆ సినిమాలో బాలకృష్ణ కూడా ఉంటే బాగుంటుంది: శివరాజ్ కుమార్

  • జైలర్ -2 లో నా పాత్ర ఉందని దర్శకుడు నెల్సన్ చెప్పారన్న శివరాజ్ కుమార్ 
  • ఈ మూవీలో బాలకృష్ణ కూడా ఉంటే బాగుంటుందని అభిప్రాయపడిన శివరాజ్ కుమార్
  • వ్యక్తిగతంగా తామిద్దరం చాలా క్లోజ్ అని వెల్లడి
కన్నడ నటుడు శివరాజ్ కుమార్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. పలు తెలుగు చిత్రాల్లోనూ నటించిన ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'పెద్ది' అనే మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఆయన '45' అనే మూవీ చిత్రీకరణలో పాల్గొని షూటింగ్ పూర్తి చేశారు.

ఉపేంద్రతో పాటు శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ త్వరలో విడుదల కానున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో వీరు ఇద్దరూ మాట్లాడారు. ఈ క్రమంలో "జైలర్ 2 (రజనీకాంత్) మూవీలో బాలకృష్ణతో కలిసి నటిస్తున్నారట కదా?" అని ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు శివరాజ్ కుమార్ సమాధానమిస్తూ.. "అవునా.. నాకు తెలియదు. ఆ సినిమాలో నా పాత్ర ఉందని దర్శకుడు నెల్సన్ చెప్పాడు" అన్నారు.

బాలకృష్ణ కూడా ఈ మూవీలో ఉంటే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన శివరాజ్ కుమార్.. బాలకృష్ణ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'లో తాను నటించానని, కానీ ఇద్దరి కాంబినేషన్‌లో సన్నివేశాలు లేవని చెప్పారు. వ్యక్తిగతంగా తామిద్దరం మంచి స్నేహితులమని, కుటుంబ సభ్యుల మాదిరిగా ఉంటామని బాలకృష్ణతో తనకు ఉన్న అనుబంధాన్ని తెలియజేశారు. 


More Telugu News