డిప్యూటీ సీఎం ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్‌.. అస‌లేమైందంటూ అభిమానుల ఆరా!

  • నిన్న ఏపీ స‌చివాల‌యంలో 16వ ఆర్థిక సంఘం స‌భ్యుల‌తో మంత్రివ‌ర్గం కీల‌క‌ భేటీ
  • అనారోగ్యంగా ఉన్నా ఈ స‌మావేశానికి హాజ‌రైన జ‌న‌సేనాని 
  • చేతికి సెలైన్ డ్రిప్ త‌గిలించుకుని క‌నిపించిన ప‌వ‌న్ 
  • నెట్టింట ఫొటో వైర‌ల్ కావ‌డంతో ఆందోళ‌న‌లో ఫ్యాన్స్  
ఏపీ స‌చివాల‌యంలో మంగ‌ళ‌వారం నాడు సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న కేబినెట్ భేటీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకోవ‌డం జ‌రిగింది. అయితే, ఈ భేటీకి హాజ‌రైన‌ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్.. స‌మావేశం ప్రారంభానికి ముందే అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. దాంతో ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క భేటీ ప్రారంభ‌మ‌య్యేలోపే అక్క‌డి నుంచి క్యాంపు ఆఫీస్‌కి వెళ్లిపోయారు. ప‌వ‌న్‌ క్యాంపు కార్యాల‌యంలోనే విశ్రాంతి తీసుకున్నారు. 

ఇక బుధ‌వారం రాష్ట్ర స‌చివాల‌యంలో 16వ ఆర్థిక సంఘం స‌భ్యుల‌తో మంత్రివ‌ర్గం కీల‌క‌మైన భేటీలో పాల్గొంది. ఈ స‌మావేశానికి జ‌న‌సేనాని హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ చేతికి సెలైన్ డ్రిప్ త‌గిలించుకుని క‌నిపించారు. దాంతో ఆయ‌న చేతికి సెలైన్ డ్రిప్ ఉన్న ఫొటో నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన ప‌వ‌న్ అభిమానులు ఆయ‌న‌కు ఏమైందంటూ ఆరా తీస్తూ, ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అనారోగ్యంగా ఉన్న డిప్యూటీ సీఎం ప్ర‌భుత్వ స‌మావేశానికి హాజ‌రు కావ‌డం అనేది ఆయ‌న క‌మిట్‌మెంట్‌కు నిద‌ర్శ‌న‌మ‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. 



More Telugu News