ఆ 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేస్తాం: మల్లు భట్టివిక్రమార్క

  • ఐటీ హబ్ ఏర్పాటుపై అధికారులతో సమీక్ష
  • పుప్పాలగూడ పరిసరాల్లోని 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడి
  • ఐటీ నాలెడ్జ్ హబ్‌తో 5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి
హైదరాబాద్‌లోని పుప్పాలగూడ పరిసర ప్రాంతాల్లో 450 ఎకరాలలో ఐటీ నాలెడ్జ్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఐటీ హబ్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌ అధికారులు, రెవెన్యూ శాఖ, స్పెషల్ పోలీసు సొసైటీలకు కేటాయించిన భూమిలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ఇదివరకే వివిధ సంస్థలకు కేటాయించిన 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆ ప్రాంతానికి సమీపంలోనే టీజీఐఐసీకి చెందిన 250 ఎకరాల భూమి కూడా ఉందని, ఈ రెండు ప్రాంతాలను కలిపి మొత్తం 450 ఎకరాలలో ఐటీ హబ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ఐటీ నాలెడ్జ్ హబ్ ద్వారా దాదాపు 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


More Telugu News