మ‌స్క్‌కు ప్ర‌ధాని మోదీ ఫోన్‌ కాల్... ఏం మాట్లాడారంటే..!

  • మ‌స్క్‌తో ఫోన్ కాల్‌లో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు 'ఎక్స్' వేదిక‌గా తెలిపిన మోదీ
  • సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై చ‌ర్చించామ‌న్న ప్ర‌ధాని
  • ఈ ఏడాది ప్రారంభంలో త‌మ‌ భేటీ సంద‌ర్భంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన అంశాల‌ను ప్ర‌స్తావించిన‌ట్లు వెల్ల‌డి
టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ, ట్రంప్ ప్ర‌భుత్వంలోని డోజ్ విభాగపు అధిప‌తి ఎలాన్ మ‌స్క్‌తో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్‌లో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ విష‌యాన్ని ప్ర‌ధాని 'ఎక్స్' (ట్విట్ట‌ర్) ద్వారా వెల్ల‌డించారు. మ‌స్క్‌తో ప‌లు అంశాలపై చ‌ర్చించిన‌ట్లు మోదీ తెలిపారు. 

ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో వాషింగ్టన్ డీసీలో భేటీ సంద‌ర్భంగా ఇరువురి మ‌ధ్య జ‌రిగిన విష‌యాలు త‌మ మ‌ధ్య‌ ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు పేర్కొన్నారు. సాంకేతిక‌, ఆవిష్క‌ర‌ణ‌ల రంగాల్లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంపై చ‌ర్చించామ‌ని మోదీ అన్నారు. ఈ రంగాల‌లో భార‌త్‌, అమెరికా భాగ‌స్వామ్యం మ‌రింత పురోగ‌మిస్తుంద‌ని ప్ర‌ధాని ఆశాభావం వ్య‌క్తం చేశారు.

కాగా, సుంకాల విష‌యంలో భార‌త్‌, అమెరికా మ‌ధ్య వాణిజ్య చ‌ర్చ‌ల అంశం కొన‌సాగుతున్న వేళ ఈ కీల‌క ప‌రిణామం చోటు చేసుకోవ‌డం గ‌మ‌నార్హం. 


More Telugu News