'కుబేర' ఫ‌స్ట్ సాంగ్ వ‌చ్చేసింది

  • శేఖర్ కమ్ముల, ధ‌నుశ్ కాంబోలో 'కుబేర‌'
  • జూన్ 20న విడుద‌ల కానున్న సినిమా
  • 'పోయి రా మావా' అంటూ సాగే పాట‌ను విడుద‌ల చేసిన మేక‌ర్స్‌
  • భాస్క‌ర్ భ‌ట్ల లిరిక్స్.. స్వ‌యంగా ఆలపించిన ధనుశ్‌ 
  • రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు
ప్రముఖ ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కోలీవుడ్ స్టార్ ధనుశ్‌ హీరోగా వస్తున్న సినిమా 'కుబేర'. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ లో సునీల్ నారంగ్ ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కింగ్ నాగార్జున కూడా కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు. ఇక‌, ధనుశ్‌ సరసన రష్మిక మందన్న క‌థానాయిక‌గా నటిస్తున్నారు. 

జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ సినిమా నుంచి తాజాగా ఫ‌స్ట్ సాంగ్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌. పోయి రా.. పోయి రా మావా అంటూ సాగిన ఈ సాంగ్ విన‌సొంపుగా ఉంది. భాస్క‌ర్ భ‌ట్ల లిరిక్స్ అందించ‌గా... స్వ‌యంగా ధనుశ్‌ ఆలపించారు. రాక్‌స్టార్‌ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించ‌గా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. 

శేఖర్ కమ్ముల సినిమా అంటే తప్పకుండా ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలానే ఉంటుంది. అందులోనూ ధనుశ్‌తో శేఖర్ కమ్ముల చేస్తున్న ఈ 'కుబేర' మీద భారీ అంచ‌నాలు ఉన్నాయి. తాజాగా వచ్చిన ఫస్ట్ సాంగ్ మాత్రం అదిరిపోయింద‌నే చెప్పాలి.



More Telugu News