రెజిల్‌మేనియాకు వెళ్లిన తొలి భార‌త సెల‌బ్రిటీగా రానా

  • లాస్ వెగాస్‌లో జ‌రిగిన డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ప్రధాన ఈవెంట్ రెజిల్‌మేనియా-41
  • ఈ ఈవెంట్‌కు హాజ‌రైన టాలీవుడ్ న‌టుడు రానా
  • ఆయ‌న్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహ‌కులు ముందు వ‌రుస సీటింగ్‌ కేటాయింపు
  • వెబ్‌ సిరీస్ 'రానా నాయుడు' సీజ‌న్‌-2 ప్రమోష‌న్‌లో భాగంగా ఈ ఈవెంట్‌కు రానా
అమెరికాలోని లాస్ వెగాస్‌లో జ‌రిగిన డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ ప్రధాన ఈవెంట్ అయిన రెజిల్‌మేనియా-41కి న‌టుడు ద‌గ్గుబాటి రానా హాజ‌ర‌య్యారు. త‌ద్వారా రెజిల్‌మేనియాకు వెళ్లి తొలి భార‌త సెల‌బ్రిటీగా రానా నిలిచారు. ఆయ‌న్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహ‌కులు ముందు వ‌రుస సీటింగ్‌ను కేటాయించారు. కార్య‌క్ర‌మం జ‌రుగుతున్న‌ప్పుడు రానా పేరును కూడా వారు అనౌన్స్ చేయ‌డం విశేషం. 

కాగా, ఈ ఈవెంట్‌కు రానా తన వెబ్‌ సిరీస్ 'రానా నాయుడు' సీజ‌న్‌-2 ప్రమోష‌న్‌లో భాగంగా వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. రెజిల్‌మేనియా ఈవెంట్‌ ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రత్యక్ష ప్రసారంలో రానా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక‌ 'రానా నాయుడు' సీజ‌న్‌-2 ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో త్వరలో ప్రసారం కానుంది. ఇందులో భాగంగా నిర్మాతలు ప్రమోషన్‌లను ప్రారంభించారు. 'రానా నాయుడు'లో రానా బాబాయ్ విక్ట‌రీ వెంకటేశ్‌ కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్న విష‌యం తెలిసిందే. కరణ్ అన్షుమాన్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. 


More Telugu News