ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్‌

  • ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 5వేల ప‌రుగుల మార్కును అందుకున్న రాహుల్‌
  • 130 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్‌ను సాధించిన స్టార్ ప్లేయ‌ర్‌
  • నిన్న‌టి ల‌క్నోతో మ్యాచ్‌లో అజేయ హాఫ్ సెంచ‌రీ (57)తో ఈ ఘ‌న‌త
  • రాహుల్‌ త‌ర్వాతి స్థానాల్లో వార్న‌ర్ (135 ఇన్నింగ్స్), కోహ్లీ (157 ఇన్నింగ్స్)  
ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌)లో భాగంగా మంగ‌ళ‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ (ఎల్ఎస్‌జీ)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ) ప్లేయ‌ర్ కేఎల్ రాహుల్ చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్స్‌ల్లోనే 5వేల ప‌రుగుల మైలురాయిని చేరుకున్నాడు. 

నిన్న‌టి ల‌క్నోతో మ్యాచ్‌లో అజేయంగా హాఫ్ సెంచ‌రీ (57) చేయ‌డం ద్వారా ఈ ఘ‌న‌త సాధించాడు. ఆ త‌ర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్న‌ర్ (135 ఇన్నింగ్స్), విరాట్ కోహ్లీ (157 ఇన్నింగ్స్), ఏబీ డివిలియ‌ర్స్ (161 ఇన్నింగ్స్), శిఖ‌ర్ ధావ‌న్ (168 ఇన్నింగ్స్) ఉన్నారు. 

ఇక, రాహుల్ 46.35 స‌గ‌టు, 135.70 స్ట్రైక్‌రేట్‌తో 5వేల ర‌న్స్ పూర్తి చేశాడు. ఇందులో 4 సెంచ‌రీలు, 40 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. అలాగే నాలుగుసార్లు డ‌కౌట్ అయ్యాడు.   

కాగా, నిన్న‌టి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ల‌క్నో నిర్దేశించిన‌ 160 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 17.5 ఓవర్లలోనే ఛేదించింది.  


More Telugu News