పాకిస్థానీ అంటూ ఆరోప‌ణ‌లు... తీవ్రంగా స్పందించిన ప్ర‌భాస్ హీరోయిన్‌

  • తాను పాకిస్థానీ సైనికాధికారి కూతురు అన్న‌ది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌న్న న‌టి
  • ట్రోల‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని కావాల‌నే వ్యాప్తి చేశార‌ని ఆగ్ర‌హం 
  • ఆ దేశంతో త‌మ‌ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేద‌ని క్లారిటీ
  • తాను భార‌తీయ‌ అమెరిక‌న్‌ని అని గ‌ర్వంగా చెబుతాన‌న్న హీరోయిన్‌
తాను పాకిస్థాన్ సంత‌తి యువ‌తినంటూ వ‌స్తున్న వార్త‌ల్ని ఫౌజీలో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తున్న హీరోయిన్ ఇమాన్వీ ఎస్మాయిల్‌ ఖండించారు. అందులో ఎలాంటి నిజం లేద‌ని అన్నారు. తాను పాకిస్థానీ సైనికాధికారి కూతురు అన్న‌ది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని ఆమె పేర్కొన్నారు. కావాల‌నే ట్రోల‌ర్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఈ విష‌యాన్ని వ్యాప్తి చేసిన‌ట్లు ఆమె ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడిని ఖండిస్తూ మృతుల కుటుంబాల‌కు సంతాపం తెలిపారు. ఈ మేర‌కు ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా సుదీర్ఘ పోస్టు పెట్టారు.  

"నేను పాకిస్థానీ సైనికాధికారి కూతురిన‌న్న‌ది ప‌చ్చి అబద్ధం. ఆ దేశంతో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు.  ఆన్‌లైన్‌లో ట్రోల‌ర్లు ఆ విష‌యాన్ని కావాల‌నే వ్యాప్తి చేశారు. మా త‌ల్లిదండ్రులు లాస్ ఏంజిలిస్‌కు వ‌ల‌స వెళ్లారు. నేను అక్క‌డే పుట్టాను. అక్క‌డే చ‌దివాను. స్ట‌డీస్ పూర్త‌యిన త‌ర్వాత న‌టిగా, డ్యాన్స‌ర్‌గా కెరీర్‌ను ప్రారంభించాను. సినిమా నా జీవితంలో ఎంతో ప్ర‌భావాన్ని చూపింది. భార‌తీయ‌త‌, భార‌త సంస్కృతి నా ర‌క్తంలోనే ఉన్నాయి. 

నేను భార‌తీయ‌ అమెరిక‌న్‌ని అని గ‌ర్వంగా చెబుతాను. హిందీ, తెలుగు, గుజ‌రాతీ, ఇంగ్లిష్ మాట్లాడే భార‌త సంత‌తి అమ్మాయిని నేను. కొన్ని పేరున్న వార్త సంస్థ‌లు కూడా నా విష‌యంలో క‌నీస ప‌రిశోధ‌న చేయ‌కుండా త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేయ‌డం బాధాక‌రం. సోష‌ల్ మీడియాను మంచి కోసం ఉప‌యోగించండి. ఈ బాధాక‌ర స‌మ‌యంలో ద్వేషాన్ని కాకుండా ప్రేమ‌ను వ్యాప్తి చేయండి" అని ఇమాన్వీ త‌న పోస్టులో రాసుకొచ్చారు. 


More Telugu News