కోహ్లీ, కేఎల్ రాహుల్‌ మాటల యుద్ధం... ఇదిగో వీడియో!

  • డీసీ, ఆర్‌సీబీ మ్యాచ్‌లో షాకింగ్ ఘ‌ట‌న‌
  • డీసీ వికెట్ కీప‌ర్ రాహుల్‌తో బ్యాటింగ్ చేస్తున్న కోహ్లీ మ‌ధ్య వాగ్వాదం
  • రాహుల్ కీపింగ్ చేస్తున్న స‌మ‌యంలో అత‌నితో కోపంగా ఏదో మాట్లాడిన కోహ్లీ 
  • ఇద్ద‌రి వాగ్వాదానికి సంబంధించిన వీడియో వైర‌ల్‌
ఆదివారం ఢిల్లీ క్యాపిట‌ల్స్ (డీసీ), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ లో షాకింగ్ ఘ‌ట‌న చోటుచేసుకుంది. డీసీ వికెట్ కీప‌ర్ కేఎల్ రాహుల్‌తో బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్ కీపింగ్ చేస్తున్న స‌మ‌యంలో కోహ్లీ కోపంగా ఏదో అత‌నితో మాట్లాడాడు. 

దానికి రాహుల్ వివ‌ర‌ణ ఇచ్చుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అయితే, ఈ వాగ్వాదానికి గ‌ల కార‌ణ‌మేంటో తెలియ‌లేదు. కానీ, మ్యాచ్ అనంత‌రం రాహుల్‌ను కోహ్లీ ఆలింగ‌నం చేసుకోగా ఇద్ద‌రు న‌వ్వుతూ క‌నిపించారు. 

ఇక‌, ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీని బెంగ‌ళూరు మ‌ట్టిక‌రిపించిన విష‌యం తెలిసిందే. కోహ్లీ మ‌రోసారి అర్ధ‌శ‌త‌కం (51)తో రాణించాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచుల్లో 63.29 స‌గ‌టుతో 443 ప‌రుగులు చేశారు. అత్యధిక ప‌రుగుల‌తో ఆరెంజ్ క్యాప్ హోల్ట‌ర్‌గా ఉన్నారు. ఇందులో ఆరు అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి. 


More Telugu News