మే 8 నుంచి అమెరికాలో 'క‌న్న‌ప్ప' టీమ్ ప్ర‌చారం

  • మంచు విష్ణు, ముకేశ్ కుమార్ సింగ్ కాంబోలో 'క‌న్న‌ప్ప' 
  • జూన్ 27న విడుదల కానున్న సినిమా
  • ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోన్న చిత్ర‌బృందం
  • న్యూజెర్సీలో రోడ్‌షోతో పాటు డల్లాస్, లాస్ ఏంజిల్స్‌లలో ఈవెంట్స్
మంచు విష్ణు, మోహ‌న్ బాబుల డ్రీమ్ ప్రాజెక్ట్ 'క‌న్న‌ప్ప' జూన్ 27న  పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. దీంతో చిత్ర‌బృందం ప్ర‌స్తుతం ముమ్మ‌రంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో భాగంగా మే 8వ తేదీ నుంచి అమెరికాలో ప్ర‌మోష‌న్స్‌కు సిద్ధ‌మ‌వుతోంది. న్యూజెర్సీలో రోడ్‌షోతో పాటు డల్లాస్, లాస్ ఏంజిల్స్‌లలో ఈవెంట్స్ ఉంటాయ‌ని తాజాగా మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ముకేశ్ కుమార్ సింగ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన 'క‌న్న‌ప్ప‌'లో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మంచు మోహన్ బాబుతో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్, శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఇత‌ర‌ కీలక పాత్రల్లో క‌నిపించ‌నున్నారు. ఇక, ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చిన విష‌యం తెలిసిందే.


More Telugu News