శ‌ర్వానంద్ కొత్త సినిమాకు ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌.. ఆస‌క్తిక‌ర వీడియోతో రివీల్ చేసిన మేక‌ర్స్‌!

  • శ‌ర్వానంద్‌, సంప‌త్ నంది కాంబోలో కొత్త సినిమా
  • ఈ చిత్రానికి భోగి అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్
  • శ‌ర్వా స‌ర‌స‌న హీరోయిన్లుగా అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్‌, డింపుల్ హ‌యాతీ
టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో ఒక మూవీ రానున్న విష‌యం తెలిసిందే. శ‌ర్వా న‌టిస్తున్న 38వ చిత్రం ఇది. తాజాగా మేక‌ర్స్ ఈ మూవీ టైటిల్‌ను ఓ ఆస‌క్తిక‌ర వీడియో ద్వారా రివీల్ చేశారు. ఈ సినిమాకు 'భోగి' అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్ పెట్టారు. 

"ప్రతి రక్తపు బొట్టుకూ ఒక కారణం ఉంటుంది. ప్రతి పండుగకూ ఒక ఉద్దేశం ఉంటుంది" అనే ఇంట్రెస్టింగ్‌ క్యాప్ష‌న్‌తో ఈ టైటిల్ రివీల్ వీడియోను విడుద‌ల చేశారు. అలాగే ఈరోజు నుంచే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలు పెట్టిన‌ట్టు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.  

కాగా, 1960లో తెలంగాణ మ‌హారాష్ట్ర బార్డ‌ర్‌లో జ‌రిగే పీరియాడిక్ యాక్ష‌న్ డ్రామాగా ఈ చిత్రం రాబోతోందని తెలుస్తోంది. ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీస‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్ నిర్మిస్తోంది. శ‌ర్వా స‌ర‌స‌న అనుప‌మ ప‌రమేశ్వ‌ర‌న్‌, డింపుల్ హ‌యాతీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. 


More Telugu News