ఓటీటీలోకి 'అర్జున్ స‌న్నాఫ్ వైజ‌యంతి' స‌డెన్‌ ఎంట్రీ.. షాక‌వుతున్న ఫ్యాన్స్‌!

  • కల్యాణ్‌ రామ్‌, ప్రదీప్‌ చిలుకూరి కాంబోలో 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'
  • కీల‌క పాత్ర‌లో లేడీ సూప‌ర్ స్టార్ విజ‌య‌శాంతి
  • ఏప్రిల్ 18న థియేటర్లోకి వ‌చ్చిన సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న‌
  • ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ స్ట్రీమింగ్
కల్యాణ్‌ రామ్‌, విజయశాంతి కలిసి నటించిన చిత్రం 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఏప్రిల్ 18న థియేటర్లోకి వ‌చ్చింది. తల్లి కొడుకు ఎమోషన్స్ నేపథ్యంలో యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ మూవీకి మిశ్రమ స్పందన వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  

అయితే, ఈ మూవీ స‌డెన్‌గా మే 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అర్థ‌రాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. విడుద‌ల అయి నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేయ‌డంతో ఫ్యాన్స్ షాక‌వుతున్నారు. అది కూడా ఎలాంటి ముంద‌స్తు ప్ర‌క‌ట‌న లేకుండానే ఓటీటీలోకి ద‌ర్శ‌న‌మివ్వ‌డం గ‌మ‌నార్హం. 

అయితే, ఇందులో చిన్న ట్విస్ట్ ఉంది. ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ స్ట్రీమింగ్ కేవ‌లం యూకేలో ఉన్న‌వాళ్ల‌కి మాత్ర‌మే అందుబాటులో ఉంది. అది కూడా అద్దె విధానంలో మాత్ర‌మే వీక్షించే వెసులుబాటు ఉంది. కాగా, గురు లేదా శుక్ర‌వారం నుంచి ఇండియాలో కూడా సినిమా మ‌నవాళ్ల‌కు అందుబాటులోకి రావొచ్చ‌ని స‌మాచారం.    

ఇక‌, 'అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి'లో బాలీవుడ్ న‌టులు అర్జున్ రాంపాల్‌, సోహైల్ ఖాన్ ల‌తో పాటు బ‌బ్లూ పృథ్వీరాజ్, చ‌ర‌ణ్ రాజ్, శ్రీరామ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. క‌ల్యాణ్ రామ్‌కు జోడిగా సయీ మంజ్రేక‌ర్ న‌టించ‌గా... అజ‌నీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ అందించారు.  




More Telugu News