అభిమానుల అత్యుత్సాహం.. ఎన్‌టీఆర్ అస‌హ‌నం.. వీడియో వైర‌ల్‌!

  • లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఘనంగా ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్
  • చెర్రీ, తార‌క్‌, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి
  • ఈ ఈవెంట్‌లో తార‌క్‌కు అస‌హ‌నం తెప్పించిన ఫ్యాన్స్‌ అత్యుత్సాహం 
  • హాల్ వెలుప‌ల అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగ‌బ‌డ్డ‌ ఫ్యాన్స్
తాజాగా లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో 'ఆర్ఆర్ఆర్' చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీంతో హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్‌టీఆర్‌, ద‌ర్శ‌కుడు రాజమౌళి, సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఇక‌, వేదిక‌పై ఎన్టీఆర్-రామ్ చ‌ర‌ణ్ బాండింగ్ చూసి అభిమానులు మురిసిపోయారు. ఆత్మీయ ఆలింగ‌నంతో పాటు రామ్ చ‌రణ్‌... తార‌క్‌కి ముద్దు పెట్ట‌డం హైలైట్‌గా నిలిచింది. 

అయితే, ఈ ఈవెంట్‌లో అభిమానుల అత్యుత్సాహం తార‌క్‌కు అస‌హ‌నం తెప్పించింది. హాల్ వెలుప‌ల అభిమాన హీరోతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ‌గా ఎన్‌టీఆర్ ఇబ్బంది ప‌డ్డారు. అదే విష‌యాన్ని వారికి చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయినా అభిమానులు విన‌క‌పోవ‌డంతో చేసేదేమి లేక అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

వీడియోలో భద్రతా సిబ్బందితో సహకరించమని అభిమానులను తార‌క్‌ కోర‌డం మ‌నం చూడొచ్చు. “నేను మీకు సెల్ఫీ ఇస్తాను. కానీ మీరు వేచి ఉండాలి. మీరు ఇలా ప్రవర్తిస్తే, మిమ్మల్ని భద్రత సిబ్బంది బయటకు పంపుతుంది” అని ఎన్‌టీఆర్‌ వారికి చెప్ప‌డం వీడియోలో ఉంది. అయితే, అభిమానులు తార‌క్ మాట‌ల‌ను పట్టించుకోలేదు. చేసేదిలేక భద్రతా సిబ్బంది ఎన్టీఆర్ ను వెంటనే అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.


More Telugu News