'ఆర్ఆర్ఆర్ 2' ఉంటుందా?... ఉపాస‌న ప్ర‌శ్నకు జ‌క్క‌న్న‌ స‌మాధానం ఇదే!

  • ఇటీవ‌ల లండ‌న్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్
  • హాజ‌రైన చ‌ర‌ణ్‌, తార‌క్‌, జ‌క్క‌న్న‌, కీర‌వాణి
  • ఇందుకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వీడియోను షేర్ చేసిన ఉపాస‌న 
  • 'ఆర్ఆర్ఆర్ 2' ఉంటుందా అని రాజ‌మౌళిని ప్ర‌శ్నించిన ఉపాస‌న‌ 
  • దీనికి 'ఎస్' అని సమాధానం చెప్పిన‌ జ‌క్క‌న్న‌
రామ్ చ‌ర‌ణ్, ఎన్‌టీఆర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఎస్ఎస్‌ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ 'ఆర్ఆర్ఆర్' చిత్రం భారీ విజ‌యాన్ని అందుకుంది. అలాగే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్లు కూడా రాబ‌ట్టింది. ఈ మూవీలోని నాటు నాటు పాట‌కి ఏకంగా ఆస్కార్ పుర‌స్కారం సైతం ద‌క్కింది. 

ఇక, ఇటీవ‌ల లండ‌న్‌లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో ఆర్ఆర్ఆర్ చిత్ర లైవ్ కాన్సర్ట్, ప్రీమియర్ ప్రదర్శన జరిగిన విష‌యం తెలిసిందే. ఈ ప్రీమియ‌ర్‌కి చ‌ర‌ణ్‌, తార‌క్ త‌మ ఫ్యామిలీల‌తో క‌లిసి హాజ‌ర‌య్యారు. అలాగే జ‌క్క‌న్న‌, సంగీత ద‌ర్శ‌కుడు ఎంఎం కీర‌వాణి కూడా వ‌చ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్క‌టిగా ఇప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

తాజాగా చ‌ర‌ణ్‌ అర్ధాంగి ఉపాస‌న ఓ వీడియో షేర్ చేశారు. అందులో ఎన్‌టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి జ‌క్క‌న్న‌ను ఆట‌ప‌ట్టించ‌డం మ‌నం చూడొచ్చు. వారిద్ద‌రు చేసే అల్ల‌రికి రాజ‌మౌళి భ‌య‌పడిపోతుండ‌డం వీడియోలో ఉంది. ఈ క్ర‌మంలో రాజ‌మౌళిని ఉపాస‌న ఆస‌క్తిక‌ర‌ ప్ర‌శ్న అడిగారు. రాజమౌళి గారు ఇప్పుడు మీరు 'ఆర్ఆర్ఆర్ 2' చేస్తారా? అని ఆమె ప్రశ్నించారు. దీనికి జ‌క్క‌న్న‌ 'ఎస్' అని సమాధానం చెప్పారు. 

దాంతో వెంటనే ఉపాసన గాడ్ బ్లెస్ యు అని స్పందించారు. దీంతో 'ఆర్ఆర్ఆర్ 2' ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో అనే చ‌ర్చ మొద‌లైంది. అయితే, రాజ‌మౌళి సీరియ‌స్‌గానే చెప్పారా? లేక స‌రదాగా స్పందించారా? అని కొంద‌రు చ‌ర్చించుకుంటున్నారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 


More Telugu News