మంచు విష్ణు ‘కన్నప్ప’ కామిక్ బుక్ ఫైనల్ చాప్టర్ కాన్సెప్ట్ వీడియో విడుదల
- జూన్ 27న ‘కన్నప్ప’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్
- ఇప్పటికే జోరుగా ప్రమోషనల్ కార్యక్రమాలు
- కన్నప్ప కథ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో కామిక్ బుక్స్ రూపంలోకి తీసుకొచ్చిన మేకర్స్
- కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లకు మంచి స్పందన
- ఇప్పుడు మూడో అధ్యాయం విడుదల
డైనమిక్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. టీజర్‌లు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఇప్పటికే యూఎస్‌లో విష్ణు స్టార్ట్ చేసిన కన్నప్ప ప్రమోషనల్ టూర్‌లు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక, కన్నప్ప కథ అందరికీ తెలియాలనే ఉద్దేశంతో చిత్ర బృందం కామిక్ బుక్స్ రూపంలోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.
కామిక్ సిరీస్‌లోని మొదటి రెండు ఎపిసోడ్‌లకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు మూడో అధ్యాయాన్ని విడుదల చేశారు. ఈ చివరి ఎపిసోడ్ తిన్నడు భావోద్వేగ, ఆధ్యాత్మిక పరివర్తనను సూచిస్తుంది. అతను ఒకప్పుడు దైవత్వం ఆలోచనను తిరస్కరిస్తాడు.. కానీ చివరికి శివుని భక్తుడిగా మారుతాడు. కన్నప్పగా మారడానికి అతని అద్భుతమైన ప్రయాణాన్ని ఈ మూడో అధ్యాయం వివరిస్తుంది. భక్తి, ప్రేమ, త్యాగం, విధితో నిండిన ఈ కథ అందరినీ ఆకట్టుకుంటుంది.
ఏఐ ద్వారా క్రియేట్ చేసిన ఈ విజువల్స్, వీడియో అందరినీ అబ్బుర పరిచేలా ఉంది. ఇంతకు మించి అనేలా సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని టీం చెబుతోంది. విజువల్ ఎఫెక్ట్స్‌లో జాప్యం వల్లే ఈ మూవీని జూన్ 27కి వ్యూహాత్మకంగా మార్చారు. ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ రోల్ లో కనిపించనున్నారు. మోహన్ బాబు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు.