మ‌రోసారి క‌న్నీళ్లు పెట్టుకున్న మంచు మ‌నోజ్‌.. వీడియో వైర‌ల్‌!

  • 'భైర‌వం' ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో మ‌నోజ్ ఎమోష‌న‌ల్‌
  • త‌న ఏవీ చూసి క‌న్నీళ్లు పెట్టుకున్న మంచువార‌బ్బాయి
  • సొంత‌వాళ్లే దూరం పెడుతున్న ఈరోజుల్లో ఫ్యాన్స్‌ త‌న‌పై ప్రేమ కురిపిస్తున్నార‌ని భావోద్వేగం
మంచు మనోజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించిన తాజా చిత్రం 'భైర‌వం'. ఈ మూవీ ట్రైల‌ర్ లాంచ్‌ ఈవెంట్ ఆదివారం ఏలూరులో జ‌రిగింది. అయితే, ఈ కార్య‌క్ర‌మంలో మనోజ్ తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. 

ఈవెంట్‌లో ఆయ‌న‌పై ఓ వీడియో (ఏవీ) ప్ర‌ద‌ర్శించారు. అది చూసి మంచువారబ్బాయి చ‌లించిపోయాడు. ఎమోష‌న్ ఆపుకోలేక క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. మోహన్ బాబు, విష్ణుతో ఆస్తి తగాదాలు, పోలీస్ కేసులు, కోర్టు చుట్టూ తిరగడం వంటి పరిస్థితుల మధ్య ఈ సినిమాను పూర్తి చేశాడు

ఆరు సంవత్సరాల గ్యాప్ తరువాత మళ్లీ తెర మీదికి రావడానికి ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, జనం ఆదరణే కారణమని చెప్పుకొచ్చాడు. సొంత‌వాళ్లే దూరం పెడుతున్న ఈ రోజుల్లో అభిమానులు త‌న‌పై ప్రేమ కురిపిస్తున్నార‌ని ఎమోష‌న్ అయ్యాడు. 

ఇక‌, యాక్షన్ థ్రిల్లర్ గా తెర‌కెక్కిన‌ 'భైరవం' మూవీ ఈ నెల 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. తమిళ దర్శకుడు శంకర్ కుమార్తె ఆదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్లై, శరత్ లోహితాశ్వ, అజయ్, సందీప్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ కింద కేకే రాధామోహన్ ఈ సినిమాను నిర్మించారు. విజయ్ కనకమేడల దర్శకుడు. తమిళం సూపర్ హిట్ అయిన గరుడన్ కు రీమేక్ గా తెరకెక్కినట్లు తెలుస్తోంది. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే... రూరల్ బ్యాక్ గ్రౌండ్ లో వారాహి అమ్మవారి ఆలయం ప్రధానాంశంగా సినిమా తెరకెక్కిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది.





More Telugu News