ఒక్క మాటతో రామ్ చరణ్ తో సినిమాపై అంచనాలు పెంచేసిన సుకుమార్!

  • రామ్‌చరణ్‌తో తన తదుపరి చిత్రం ఏ విధంగా ఉంటుందో తెలిపిన దర్శకుడు సుకుమార్ 
  • రామ్‌చరణ్‌తో సినిమాకు కథ సిద్దం చేసినట్లు వెల్లడి
  • త్వరలో షుటింగ్ ప్రారంభ వివరాలు వెల్లడిస్తానన్న సుకుమార్ 
ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో తన తదుపరి చిత్రం గురించి ఒక్క మాటతో అంచనాలు పెంచేశారు. సుకుమార్ తన స్వగ్రామమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం మట్టపర్రుకు కుటుంబ సమేతంగా విచ్చేశారు. గ్రామస్తులు, చిన్ననాటి స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు.

ఈ సందర్భంగా సుకుమార్ ఓ మీడియాతో మాట్లాడుతూ హీరో రామ్ చరణ్‌తో సినిమా తీసేందుకు కథ సిద్ధం చేసినట్లు తెలిపారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభించేది త్వరలో వెల్లడిస్తానన్నారు. తమ కాంబినేషన్‌లో వచ్చిన 'రంగస్థలం' చిత్రం అప్పట్లో ఇండస్ట్రీలో హిట్‌గా నిలిచిందన్నారు. ఆ తర్వాత 'ఆర్ఆర్ఆర్'తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్థాయికి ఎదిగారని అన్నారు.

ఆయనతో తాను తీయబోయే సినిమా ఆ స్థాయిలోనే ఉంటుందని పేర్కొన్నారు. సుకుమార్ మాటలతో రామ్ చరణ్ తదుపరి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉంటుందన్న అంచనాతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌తో తీసిన 'పుష్ప' ద్వారా తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, దానికి వచ్చిన స్పందన చూసి రెండో భాగాన్ని మరింత శ్రద్ధతో తీశామని సుకుమార్ పేర్కొన్నారు. 


More Telugu News