ఏదో ఒక‌రోజు చంద్ర‌బాబును లోకేశ్ గ‌ద్దె దించుతారు: పేర్నినాని

  • సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి మాజీ మంత్రి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • ఎన్‌టీఆర్‌ను చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచార‌న్న పేర్నినాని
  • చంద్ర‌బాబు చేసిన పాపాలు ఊరికే పోవ‌ని వ్యాఖ్య‌
  • ఆ పాపాల వ‌ల్లే పై నుంచి ఎన్‌టీఆర్ లోకేశ్‌తో బాబు కాళ్లు లాగిస్తున్నార‌ని విమ‌ర్శ‌
వైసీపీ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని సీఎం చంద్ర‌బాబును ఉద్దేశించి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏదో ఒక‌రోజు చంద్ర‌బాబును ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేశ్ గ‌ద్దె దించ‌డం ఖాయ‌మ‌ని అన్నారు. శిశుపాలుడి పాపాలు పెరిగిన‌ట్టు లెక్క‌కు మించి పాపాలు చేస్తున్నార‌ని అన్నారు. చ‌క్ర‌వ‌డ్డీతో స‌హా ఆ పాపాల‌కు ప‌ర్యవ‌సానం దారుణాతి దారుణంగా అనుభ‌విస్తార‌ని తెలిపారు.   

ఎన్‌టీఆర్‌ను చంద్ర‌బాబు వెన్నుపోటు పొడిచార‌ని, కాంగ్రెస్ నుంచి పెద్దాయ‌న కాళ్ల వద్ద‌కు చేరిన పెద్ద కోవ‌ర్టు అని విమ‌ర్శించారు. చంద్ర‌బాబు చేసిన పాపాలు ఊరికే పోవ‌ని, ఆ పాపాల వ‌ల్లనే పై నుంచి ఎన్‌టీఆర్ లోకేశ్‌తో బాబు కాళ్లు లాగిస్తున్నార‌ని అన్నారు. రేపో మాపో సీఎం కుర్చీలోంచి కూడా లాగేసే రోజు వ‌స్తుంద‌ని తెలిపారు. 

టీడీపీలో ఆధిప‌త్య పోరు కార‌ణంగానే ప‌ల్నాడులో జంట హ‌త్య‌లు జ‌రిగాయ‌ని పేర్నినాని చెప్పారు. కేసులో దుర్మార్గంగా పిన్నెల్లి సోద‌రుల‌ను ఇరికించార‌ని దుయ్య‌బ‌ట్టారు. టీడీపీ వాళ్లు చంపుకుని వైసీపీ నేత‌ల‌పై కేసులు పెడుతున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు. 


More Telugu News