సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు క‌దా' రిలీజ్ డేట్ ఫిక్స్

  • సిద్ధు జొన్నలగడ్డ, నీర‌జ కోన కాంబోలో 'తెలుసు క‌దా'
  • రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న సినిమా
  • దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 17న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాల‌తో స్టార్ బాయ్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ చేస్తున్న తాజా చిత్రం 'తెలుసు క‌దా'. రొమాంటిక్ ల‌వ్ డ్రామాగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి నీర‌జ కోన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇన్నాళ్లు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రించిన నీర‌జ కోన తొలిసారి మెగా ఫోన్ ప‌డుతూ ఈ మూవీ ద్వారా డైరెక్ట‌ర్‌గా మారారు. 

అయితే, గ‌త కొన్ని రోజులుగా ఈ చిత్రం రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు మేక‌ర్స్‌ తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. ఈ మూవీని దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 17న విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించారు. రొమాంటిక్ ల‌వ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా కోసం విడుద‌ల చేసిన ప్ర‌మోష‌న‌ల్ వీడియో ఆక‌ట్టుకుంటోంది.

ఇక‌, ఇటీవ‌ల 'జాక్‌' సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సిద్ధుకు, ఆశించిన స్థాయిలో మూవీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో నిరాశే ఎదురైంది. దీంతో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావాల‌నే ప్లాన్‌లో ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా చేస్తున్నారు. రాశీఖ‌న్నా, శ్రీ‌నిధిశెట్టి క‌థానాయిక‌లుగా చేస్తున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. 



More Telugu News