అతడి టాలెంట్ నాకు తెలుసు కాబట్టి ఇంకేమీ ఆలోచించలేదు: నాగార్జున

  • ముంబైలో ఘనంగా 'కుబేర' సినిమా 'పీ పీ డుమ్ డుమ్' పాట విడుదల
  • శేఖర్ కమ్ముల ప్రతిభపై నమ్మకంతోనే సినిమా ఒప్పుకున్నానన్న నాగార్జున
  • ధనుష్ అద్భుత నటుడని, రష్మిక టాలెంట్‌కు పవర్‌హౌస్ అని కొనియాడిన నాగ్
  • ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానున్న పాన్ ఇండియా చిత్రం 'కుబేర'
కింగ్ నాగార్జున, విలక్షణ నటుడు ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న, జిమ్ షర్బ్ ప్రధాన పాత్రల్లో ప్రతిభావంతుడైన దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. మంగళవారం ముంబైలో ‘పీ పీ డుమ్ డుమ్’ అనే పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేసింది.

ఈ కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయన నన్ను కలిసి ‘కుబేర’లో ఒక పాత్ర చేయాలని అడిగినప్పుడు, ఆయన టాలెంట్ నాకు తెలుసు కాబట్టి కథ గానీ, పాత్ర గానీ ఎలా ఉంటుందని కూడా అడగలేదు. ఈ సినిమా నాకెంతో ప్రత్యేకం" అని తెలిపారు. సహనటులను ప్రశంసిస్తూ, "జిమ్ షర్బ్ అద్భుతంగా నటించాడు. నాకంటే బాగా తెలుగులో డైలాగ్స్ చెప్పాడు. ధనుష్ బ్రిలియంట్ యాక్టర్. సెట్స్‌లోకి అడుగుపెట్టగానే పాత్ర గురించే ఆలోచిస్తాడు. ఇక రష్మిక గురించి మీ అందరికీ తెలుసు. టాలెంట్‌కి ఆమె ఒక పవర్‌హౌస్‌. ఆమె సినిమాల కలెక్షన్లు చూస్తే మా అందరినీ దాటేసింది. ఈ సినిమాతో రష్మిక మీ అందరికీ మంచి వినోదం పంచుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు ప్రధాన బలం" అని కొనియాడారు.




More Telugu News