యశోద ఆస్పత్రిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి.. పరామర్శించిన కేసీఆర్, కవిత

  • ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జారిపడి గాయపడ్డ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
  • యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పల్లా
  • కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం నేరుగా ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్
  • పల్లా ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న మాజీ సీఎం
బీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం ఉదయం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కాలు జారి కింద పడటంతో ఆయనకు గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన్ను పరామర్శించారు.

బుధవారం బీఆర్‌కే భవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. విచారణ ముగిసిన వెంటనే ఆయన నేరుగా యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్న పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

కేసీఆర్ వెంట బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు ఉన్నారు. పల్లా త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు. కేసీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి పల్లా రాజేశ్వర్ రెడ్డిని పరామర్శించారు.


More Telugu News