కుప్పకూలిన ఎయిరిండియా విమానం.. వీడియో ఇదిగో!

  • అహ్మదాబాద్ లో ఘోర విమాన ప్రమాదం
  • ప్రమాదం సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు
  • విమానం కూలిపోతున్న దృశ్యాన్ని మొబైల్ లో బంధించిన స్థానిక వ్యక్తి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. విమానం కూలిపోతున్న దృశ్యాన్ని ఒక స్థానిక వ్యక్తి తన ఫోన్ లో బంధించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.


More Telugu News