తెలుగులో నాకు డైరెక్షన్ చేసే అవకాశం వస్తే.. పవన్ సార్‌ను డైరెక్ట్ చేయాలనుంది: ధ‌నుశ్‌

  • హైదరాబాద్‌లో నిన్న రాత్రి 'కుబేర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌
  • టాలీవుడ్‌లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలంటే ఏ హీరోను ఎంచుకుంటార‌ని ధ‌నుశ్‌కు ప్ర‌శ్న‌
  • ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు చెప్పిన కోలీవుడ్ స్టార్ హీరో
  • ధనుశ్ అలా చెప్పగానే హోరెత్తిన‌ ఆడిటోరియం
హైదరాబాద్‌లో నిన్న రాత్రి 'కుబేర' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మేక‌ర్స్‌ ఘనంగా నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా మూవీలో న‌టించిన‌ తమిళ స్టార్ హీరో ధనుశ్‌ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. యాంక‌ర్ సుమ అడిగిన ఓ ఇంట్రెస్టింగ్ ప్ర‌శ్న‌కు ధ‌నుశ్ అంతే ఆస‌క్తిక‌ర స‌మాధానం చెప్పారు. టాలీవుడ్‌లో ద‌ర్శ‌క‌త్వం వ‌హించాలంటే ఏ హీరోను ఎంచుకుంటారు అని ధ‌నుశ్‌ను ఆమె అడిగారు. దీనికి ఆయ‌న త‌న‌కు తెలుగులో డైరెక్షన్ చేసే అవకాశం వస్తే, పవన్ కల్యాణ్ సార్‌ను డైరెక్ట్ చేయాలనుంది అని స‌మాధానం ఇచ్చారు.  

ధనుశ్ అలా చెప్పగానే ఆడిటోరియం మొత్తమూ ఉర్రూతలూగింది. ఫ్యాన్స్‌ ఈలలు, కేకలతో హోరెత్తించారు. ఇక‌, పవన్ పట్ల తన అభిమానాన్ని ధనుశ్‌ ఇప్పటికే ఎన్నోసార్లు వ్యక్తం చేశారు. గతంలోనూ “తెలుగులో నాకు ఇష్టమైన హీరో పవన్ కల్యాణ్” అని చెప్పారు. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి, ఆయ‌న‌ని నేను డైరెక్ట్ చేయాలనుకుంటున్నా అని చెప్పడం అభిమానుల్లో ఆనందం నింపింది.

కాగా, టాలీవుడ్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న 'కుబేర' సినిమాలో ధనుశ్‌తో పాటు రష్మిక మందన్నా, నాగార్జున కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం జూన్ 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలోనే ఆదివారం రాత్రి ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చిత్ర ట్రైల‌ర్‌ను కూడా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ ప్రామిసింగ్‌గా ఉండ‌డంతో సినిమాపై మంచి అంచనాలు నెల‌కొన్నాయి.


More Telugu News