ఒకే కారులో విజయ్ దేవరకొండ, రష్మిక.. మళ్లీ వార్తల్లో హాట్ టాపిక్!
- విజయ్ దేవరకొండ, రష్మిక ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షం
- ఒకే కారులో ప్రయాణిస్తూ కెమెరాలకు చిక్కిన జంట
- వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై మరోసారి ఊహాగానాలు షురూ
- రష్మిక నటిస్తున్న 'కుబేర' సినిమాకు విజయ్ శుభాకాంక్షలు
- వీరిద్దరూ మూడోసారి కలిసి నటించనున్నారంటూ వార్తలు
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి వార్తల్లో నిలిచారు. వీరిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ ఈ జంట తాజాగా ముంబై విమానాశ్రయంలో కలిసి కనిపించడం సినీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్‌లో రష్మిక ప్రయాణిస్తున్న కారులోనే విజయ్ దేవరకొండ ముందు సీటులో కూర్చుని కనిపించారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొందరు ఫోటోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో విజయ్, రష్మిక నిజంగానే ప్రేమలో ఉన్నారనే చర్చ మళ్లీ జోరందుకుంది.
గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కలిసి నటించి, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ జంట, నిజ జీవితంలోనూ కలిసే ఉంటున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి.
ఇదిలాఉంటే.. రష్మిక నటిస్తున్న తాజా చిత్రం 'కుబేర' విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "కుబేర టీమ్‌కు నా శుభాకాంక్షలు. నా కెరీర్‌లో దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేక స్థానం ఉంది. నాలాంటి ఎంతో మంది నటుల కలలను ఆయన నిజం చేశారు. నా అభిమాన తారలు నటించిన ఈ సినిమాను పెద్ద తెరపై చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అంటూ విజయ్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' అనే చిత్రంతో పాటు దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక కథానాయికగా నటించే అవకాశం ఉందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే విజయ్-రష్మిక జోడీని ముచ్చటగా మూడోసారి తెరపై చూసే అవకాశం దక్కుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.