'కూలీ' ఫస్టు రికార్డు అదే అవుతుందట!

  • రజనీకాంత్ తాజా చిత్రంగా 'కూలీ'
  • 350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా 
  • విదేశీ హక్కుల కోసం గట్టి పోటీ 
  • ఆగస్టు 14వ తేదీన సినిమా రిలీజ్

రజనీకాంత్ ను ఎప్పటికప్పుడు మరింత కొత్తగా చూపించడానికి కుర్ర దర్శకులంతా పోటీ పడుతున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు లోకేశ్ కనగరాజ్ వంతు వచ్చేసింది. రజనీకాంత్ తో ఆయన రూపొందించిన 'కూలీ' గురించే ఇప్పుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కమల్ వంటి సీనియర్ స్టార్ కి 'విక్రమ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన లోకేశ్, రజనీతో చేసే మేజిక్ ఎలా ఉంటుందో చూడటానికి అభిమానులంతా వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. 

యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి, కళానిధి మారన్ నిర్మాతగా వ్యవహరించాడు. దాదాపు 350 కోట్ల రూపాయలతో ఈ సినిమాను నిర్మించినట్టుగా వినికిడి. దేశ విదేశాలలో రజనీకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఆయన గత చిత్రాల కంటే ఎక్కువగా ఈ సినిమాకి బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 విదేశీ పంపిణి హక్కులకి సంబంధించి 70 - 80 కోట్లు చెల్లించడానికి  కొన్ని బడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయట. అయితే నిర్మాత కళానిధి మారన్ అంతకుమించిన రేటు చెబుతున్నారని సమాచారం. విదేశీ రైట్స్ 80 కోట్లు దాటితే, ఈ సినిమా ఫస్టు రికార్డు అదే అవుతుందని అంటున్నారు. నాగార్జున .. ఉపేంద్ర .. శృతిహాసన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఆగస్టు 14న థియేటర్లకు రానుంది.



More Telugu News