అమెరికాతో అణు చర్చలు జరిపే ప్రసక్తే లేదు: ఇరాన్

  • అణు ఒప్పందాలపై చర్చలకు రావాలని అమెరికా కోరిందన్న ఇరాన్
  • తమపై దాడులు ఆగేంత వరకు చర్చలు ఉండవని స్పష్టీకరణ
  • ఇజ్రాయెల్ దాడుల వెనుక అమెరికా ఉందని అనుమానిస్తున్నామన్న ఇరాన్ మంత్రి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ముదురుతున్నాయి. తమపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తున్నంత కాలం అమెరికాతో ఎలాంటి అణు ఒప్పంద చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ ఖరాఖండిగా స్పష్టం చేసింది. ఒకవేళ ఇరాన్ చర్చలకు ముందుకు రాకపోతే, రెండు వారాల్లోగా ఆ దేశంపై దాడులకు దిగే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఈ వైఖరిని వెల్లడించింది.

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ ఈ విషయంపై స్పందిస్తూ, అణు ఒప్పందంపై చర్చలకు రావాల్సిందిగా అమెరికా కోరిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్‌పై ఇజ్రాయిల్ జరుపుతున్న దాడుల వెనుక ఖచ్చితంగా అమెరికా హస్తం ఉందని తాము అనుమానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నప్పటికీ, అమెరికా ప్రోత్సాహంతోనే ఇజ్రాయిల్ ఈ దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని ఇరాన్‌తో పాటు అనేక దేశాలు విశ్వసిస్తున్నాయని ఆయన అన్నారు.


More Telugu News