ఉన్మాదిగా మార్చిన చీరకట్టు .. ఓటీటీలో బోల్డ్ థ్రిల్లర్ మూవీ!
- వర్మ నిర్మించిన 'శారీ' మూవీ
- దర్శకుడిగా గిరికృష్ణ కమల్ పరిచయం
- హీరోయిన్ గా ఆరాధ్యదేవి ఎంట్రీ
- ఈ నెల 27 నుంచి 'లయన్స్ గేట్ ప్లే'లో
ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లను థ్రిల్లర్ కంటెంట్లు ఒక ఊపు ఊపేస్తున్నాయి. ఈ జోనర్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటంతో, ఈ తరహా కంటెంట్ కి మంచి గిరాకీ పెరిగిపోయింది. అందువలన ఈ జోనర్ నుంచి వరుస సిరీస్ లు .. సినిమాలు ఊడిపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఓ తెలుగు బోల్డ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీకి రావడానికి రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'శారీ'.
అవును .. ఇది రామ్ గోపాల్ వర్మ నిర్మించిన సినిమానే. ఆయన ఒక రేంజ్ లో ప్రమోషన్స్ లో పాల్గొన్న సినిమానే. ఈ సినిమాతో ఆయన ఆరాధ్యదేవి అనే హీరోయిన్ ను టాలీవుడ్ కి పరిచయం చేశారు. గిరికృష్ణ కమల్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేశారు. యూత్ నుంచి ఒక రేంజ్ రెస్పాన్స్ ను ఆశించారు గానీ .. అలా జరగలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి 'లయన్స్ గేట్ ప్లే'లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే .. కిట్టూ అనే ఒక యువకుడు ఫ్రెండ్స్ తో కలిసి టూర్ కి వెళతాడు. అక్కడ అతనికి ఒక అందమైన యువతి కనిపిస్తుంది. ఆమె చీరకట్టు అతనికి విపరీతంగా నచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఆమెకి ఐ లవ్ యూ చెబుతాడు. ఆమె మాత్రం సున్నితంగా తిరస్కరిస్తుంది. దాంతో ఉన్మాదిగా మారిపోయిన కిట్టూ ఏం చేస్తాడు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.