మీడియాలో చూశాకే తెలిసింది.. అత్యాచార ఘటనపై లా కాలేజీ వీసీ వ్యాఖ్య

  • క్యాంపస్ లో రేప్ జరిగితే మీడియాలో ప్రసారమయ్యేదాకా వీసీకి తెలియలేదట
  • పోలీసులు వచ్చినా తమకు చెప్పలేదన్న వైస్ ప్రిన్సిపల్
  • తాత్కాలిక లెక్చరరే ప్రధాన నిందితుడు.. లా కాలేజీ ఘటనలో సంచలన నిజాలు
కాలేజ్ క్యాంపస్ లో జరిగిన అత్యాచారం గురించి మీడియా ప్రసారం చేశాకే తమకు తెలిసిందని లా కాలేజీ వైస్ ప్రిన్సిపల్ నయనా చటర్జీ చెప్పారు. దీంతో వైస్ ప్రిన్సిపాల్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. అత్యాచార ఘటనపై బాధితురాలు గానీ, ఇతర విద్యార్థులు గానీ, సిబ్బంది గానీ తమను సంప్రదించలేదని ఆమె స్పష్టం చేశారు.

జూన్ 25న ఈ ఘటన జరగ్గా, ఆ మరుసటి రోజు పోలీసులు కాలేజీ ప్రాంగణంలోకి వచ్చేందుకు అనుమతి కోరారని ఆమె తెలిపారు. అయితే, ఇది అధికారిక రహస్య పర్యటన అని చెప్పారని, కనీసం సెక్యూరిటీ గార్డుకు కూడా సమాచారం ఇవ్వవద్దని కోరినట్లు వివరించారు. పోలీసులు కింద అంతస్తులోని రెండు గదులను సీల్ చేశారని, అయితే ఘటన గురించి తమకు శుక్రవారం మీడియాలో చూసేంత వరకు తెలియలేదని ఆమె పేర్కొన్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మనోజిత్ మిశ్రా తమ కాలేజీ పూర్వ విద్యార్థి అని, కొన్ని నెలల క్రితమే అతడిని తాత్కాలిక అధ్యాపకుడిగా నియమించుకున్నామని చటర్జీ వెల్లడించారు. సిబ్బంది కొరత కారణంగా, రోజుకు 500 రూపాయల వేతనంతో అతడిని నియమించినట్లు తెలిపారు. అధికార పార్టీ విద్యార్థి విభాగంలో పదవిలో ఉన్న మిశ్రా, కాలేజీలో తన ప్రాబల్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నించేవాడని నయనా చటర్జీ చెప్పారు.


More Telugu News