ఆ హీరోయిన్ పదేళ్లపాటు ఇంట్లో నుంచి బయటికి రాలేదట!
- తమిళ .. మలయాళ సినిమాలు చేసిన కనక
- వివాహానికి దూరంగా ఉన్న వైనం
- తల్లి మరణంతో ఒంటరితనం
- ఆమెకి పిచ్చెక్కిందనే ప్రచారం
- తట్టుకుని నిలబడిన కనక
కనక .. నిన్నటి తరం హీరోయిన్. తమిళ .. మలయాళ భాషల్లో దాదాపు 50 సినిమాలలో నటించింది. తెలుగులో మాత్రం రెండు .. మూడు సినిమాలు మాత్రమే చేసింది. కనక ఎవరో కాదు .. ఎన్టీఆర్ .. కాంతరావు సరసన పలు చిత్రాలలలో నటించిన దేవిక కూతురు. అలాంటి కనక కెరియర్ పరంగా .. వ్యక్తిగతంగా అనేక కష్టాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ విషయాలను గురించి దర్శకుడు నందం హరిశ్చంద్రరావు, 'ట్రీ మీడియా'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
" దేవదాసు అనే వ్యక్తిని దేవిక వివాహం చేసుకుంది. అయితే కనక పుట్టిన తరువాత ఆ భార్యాభర్తల మధ్య స్పర్థలు వచ్చాయి. దేవదాసు సొంత సినిమాలు తీస్తూ, నష్టాలు తీసుకొస్తూ ఉండటమే అందుకు కారణం. అతని ఆగడాలు భరించలేని దేవిక, తన కూతురును తీసుకుని వేరే ఇంటికి మారిపోయింది. అయినా అతను ఆమెను వేధించడం మానుకోలేదు. తల్లిని తండ్రి నానా మాటలు అంటూ ఉండటం చూస్తూ పెరిగిన కనక, సహజంగానే తండ్రికి దూరమైపోయింది" అని అన్నారు.
" తల్లిదండ్రుల గొడవలు చూస్తూ వచ్చిన కనక, పెళ్లి చేసుకోలేదు. తండ్రిపై నమ్మకం కోల్పోయిన ఆమె, పూర్తిగా తల్లిపై ఆధారపడిపోయింది. అలాంటి పరిస్థితులలో దేవిక చనిపోయింది. తల్లి చనిపోయిన దగ్గర నుంచి కనక బయటికి రాలేదు. అలా ఇంట్లో .. నాలుగు గోడల మధ్యనే గడుపుతూ వచ్చింది. అలా ఓ పదేళ్లపాటు ఆమె ఇంటికే పరిమితమైపోయింది. ఆమెకి పిచ్చెక్కిందనే ప్రచారం కూడా ఒక దశలో జరిగింది. ఇలాంటివాటిని ఆమె తట్టుకుని నిలబడింది. ఏదేమైనా హీరోయిన్ గా వెలిగిన కనక జీవితం ఇలా కావడం దురదృష్టకరమే" అని చెప్పారు.