బాలకృష్ణగారిని చూడగానే అలా అనిపించింది: చిన్నికృష్ణ

  • బాలకృష్ణగారికి కథ వినిపించాను 
  • ఆయన భక్తి చూసి నాకు ఆశ్చర్యం వేసింది 
  • నా కథలో ఆయన నటించడం గొప్పగా అనిపించింది
  • ఆయనకి  రుణపడి ఉంటానన్న చిన్నికృష్ణ

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగిన సినిమాలలో 'నరసింహనాయుడు' ఒకటి. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2001లో థియేటర్లలో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమాకి కథను అందించింది చిన్నికృష్ణ. తాజాగా ఆయన 'తెలుగు వన్' ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ సినిమాకి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"బాలకృష్ణగారికి ఈ కథను చెప్పడానికి వెళ్లాను. బాలకృష్ణ గారు అప్పుడు పూజలో ఉన్నారు. ఆయన లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తారని నాకు అప్పుడే తెలిసింది. ఆయనను చూడగానే సనాతన ధర్మాన్ని గుండెల నిండుగా నింపుకున్న వ్యక్తిగా నాకు కనిపించారు. నేను చెప్పిన కథ ఆయనకి కనెక్ట్ అయింది. ఆయన నాకు కొత్త బట్టలు పెట్టి పంపించారు. ఆయన చూపించిన ఆప్యాయత .. గౌరవం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది" అని అన్నారు. 

'నరసింహనాయుడు' సినిమా షూటింగు జరుగుతూ ఉంటే నేను స్పాట్ లోనే ఉండేవాడిని. నా కథ ఎలా వస్తుందా అనేది నేను చూసుకునేవాడిని. నేను రాసిన సీన్స్ లో బాలకృష్ణగారు నటిస్తుంటే చాలా గర్వంగా .. హ్యాపీగా అనిపిస్తూ ఉండేది. ఆ సినిమాలో ట్రైన్ సీన్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమాతో నాకు అవకాశం ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి .. పరుచూరి బ్రదర్స్ కి .. గోపాల్ గారికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను" అని చెప్పారు. 



More Telugu News