తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ .. ఓటీటీ రెస్పాన్స్ అదుర్స్ !

  • సాయిరాం శంకర్ హీరోగా సినిమా
  • కీలకమైన పాత్రలో సముద్రఖని  
  • సస్పెన్స్ తో సాగే లీగల్ థ్రిల్లర్ 
  • జూన్ 27 నుంచి మొదలైన స్ట్రీమింగ్ 
  • ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో దూసుకుపోతున్న సినిమా    
    
ఒక వైపు నుంచి మలయాళ .. తమిళ భాషల నుంచి వచ్చిన చిన్న సినిమాలు ఓటీటీలో తమ సత్తా చాటుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు నుంచి వచ్చిన ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతోంది. చిన్న బడ్జెట్ లో రూపొందినప్పటికీ, కేవలం కంటెంట్ తో ఆకట్టుకుంటోంది. సాయిరామ్ శంకర్ కథానాయకుడిగా నటించిన ఆ సినిమా పేరే 'ఒక పథకం ప్రకారం'. వినోద్ విజయన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది.

గార్లపాటి రమేశ్ నిర్మించిన ఈ సినిమా, ఫిబ్రవరి 7వ తేదీన థియేటర్లకు వచ్చింది. టైటిల్ ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ, ఎక్కువమందికి రీచ్ కాలేకపోయింది. అలాంటి ఈ సినిమా జూన్ 27వ తేదీ నుంచి 'సన్ నెక్స్ట్' ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీ వైపు నుంచి ఈ కంటెంట్ కి మంచి మార్కులు పడ్డాయి. అందువల్లనే ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నట్టుగా తెలుస్తోంది. సముద్రఖని .. శృతి సోధి .. ఆషిమా నర్వాల్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.

కథలోకి వెళితే .. విశాఖలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడిని పట్టుకోవడానికి పోలీసు బృందం రంగంలోకి దిగుతుంది. వారి అన్వేషణ హీరో దగ్గర ఆగుతుంది. అతనే హంతకుడు అనే అనుమానం కలగడమే అందుకు కారణం. ఈ గండం నుంచి హీరో ఎలా బయటపడతాడు? పథకం ప్రకారం అతనిని ఇరికించాలని అనుకున్నది ఎవరు? అనేదే మిగతా కథ. 



More Telugu News