పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై పుకార్లు... స్పందించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
- ఓజీ’ సినిమా వాయిదా వదంతులకు తెరదించిన చిత్ర బృందం
- ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 25న విడుదల అని స్పష్టత
- సోషల్ మీడియా ద్వారా ధృవీకరించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఓజీ’ (OG) విడుదల తేదీపై నెలకొన్న అనుమానాలకు చిత్ర నిర్మాణ సంస్థ తెరదించింది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై వస్తున్న ఊహాగానాలపై డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ స్పందించింది. చెప్పిన తేదీకే 'ఓజీ' వస్తుందని స్పష్టం చేసింది.
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఓజీ’. ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వదంతులపై ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వివరణ ఇచ్చింది. ‘ఓజీ’ చిత్రాన్ని ముందుగా ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ధృవీకరించింది. అభిమానులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని కోరింది. దీంతో సినిమా విడుదల తేదీపై పూర్తి స్పష్టత వచ్చినట్లయింది. ఈ చిత్రంలో పవన్ సరికొత్త లుక్‌లో కనిపించనుండగా, ఆయన సరసన ప్రియాంకా మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు.