హాలివుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కి ఎంపికైన దీపిక పదుకొణె
- అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకున్న నటి దీపిక పడుకొణె
- హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026లో దీపికకు చోటు
- అధికారికంగా ప్రకటించిన హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
ప్రముఖ నటి దీపికా పదుకొణెకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ఆమె హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు ఎంపికయ్యారు. ఈ మేరకు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.
మోషన్ పిక్చర్స్ విభాగంలో ఆమె ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటి దీపిక కావడం విశేషం. హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన జాబితాలో డెమి మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్ వంటి హాలీవుడ్ తారలతో పాటు దీపిక పేరు కూడా ఉండటంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026కు 35 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసినట్లు ఛాంబర్ ప్రకటించింది.
కాగా, దీపికా పదుకొణె 2006లో సినీ పరిశ్రమలోకి ప్రవేశించగా, 2017లో రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్‌తో హాలీవుడ్ తెరపై మెరిశారు. ప్రస్తుతం అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో రానున్న బహుభాషా చిత్రంలో దీపిక నటిస్తున్నారు. దీని తర్వాత కల్కి 2898 ఏడీ సీక్వెల్‌లోనూ నటించనున్నారు.