Skip to content

'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' మూవీ రివ్యూ

Vishwanath And Sons Movie review

Vishwanath And Sons Review

కుటుంబ కథలతో ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాలకు ఉన్న క్రేజ్‌, దాని బాక్సాఫీస్‌ లెక్కలు కూడా వేరుగా ఉంటాయి. కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జతకలిస్తే థియేటర్‌లు ఫ్యామిలీ ప్రేక్షకులతో కళకళలాడుతాయి. అందుకే కాబోలు గత కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉన్న దర్శకులు, హీరోలు ఇప్పుడు అలాంటి సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే హీరో సూర్య 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రంం ఎలా ఉంది? దర్శకుడు వెంకీ అట్లూరి హీరో సూర్యకు సక్సెస్‌ఫుల్‌ సినిమానిచ్చాడా? 'విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌' సినిమాలో ప్రేక్షకులు అలరించే అంశాలున్నాయా? లేదా? రివ్యూలో తెలుసుకుందాం. 

సంజయ్‌ విశ్వనాథ్‌ (సూర్య) ఓ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడు. ఒకవైపు బిజినెస్‌ చూసుకుంటూనే మరొక వైపు అమ్మ (రాధికా శరత్‌ కుమార్‌) కోరిక మేరకు రైఫిల్‌ షూటింగ్‌లో నైపుణ్యం సంపాందించి భారత్‌ తరపున ఒలింపిక్స్‌లో పాల్గొని బంగారు పతాకం గెలుస్తాడు. అయితే వివాహాం విషయంలో ఆయన మనసులో ఉన్న ఓ అభిప్రాయం కారణంగా 40 ఏండ్లు దాటినా పెళ్లి చేసుకోడు. ఆయన చిన్నప్పుడు తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలే అందుకు కారణం. తల్లి మాత్రం పెళ్లి చేసుకుని కుటుంబానికి వారసుడిని ఇవ్వాలని సంజయ్‌ని పదే పదే కోరుతుంది. దీంతో ఓ డాక్టర్‌ సలహాతో అమెరికా వెళ్లి సరోగసి ద్వారా ఓ బాలుడిని కని ఇంటికి తీసుకొస్తాడు. 

అయితే అనుకోకుండా ఆ బాబు అనారోగ్యానికి గురవుతాడు. బాబు అనారోగ్యం నయం కావాలంటే కన్నతల్లి అవసరం పడుతుంది.  దీంతో బాబు కన్నతల్లి గురించి అమెరికా వెళతాడు సంజయ్‌ విశ్వనాథ్‌. ఇక బాబుకు జన్మనిచ్చిన తల్లి దొరికిందా? అమెరికా నుంచి ఇండియాకు రావటానికి ఆమె ఒప్పుకుందా? ఒప్పుకుంటే ఎలా కండిషన్స్‌ పెట్టింది? సంజయ్‌ తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాడా? సంజయ్‌ జీవితంలో మ్యాడీ (మమిత బైజు) ఎలా వచ్చింది? ఆమె వచ్చిన తరువాత ఆయన జీవితంలో వచ్చిన మార్పులేమిటి? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథకు డీసెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ను జోడించి కుటుంబ మొత్తం హాయిగా కూర్చొని ఆస్వాదించే విధంగా ఉన్న ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. సినిమా ప్రారంభమైన తొలి సన్నివేశం నుంచే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తూ చివరి సన్నివేశం వరకు మనసుకు హత్తుకునే విధంగా ఈ సినిమాను మలిచారు దర్శకుడు వెంకీ అట్లూరి. హీరో సూర్యను ఇలాంటి స్టయిలిష్‌ రోల్‌లో చూసి చాలా రోజులైంది. ఆయన స్టైల్‌కు తగిన విధంగా ఓ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని దానికి ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవించిన విధానం ఎంతో ప్రశంసనీయం. హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ఏజ్‌ గ్యాప్‌, సరోగసి ద్వారా బిడ్డను కనడం, దానితో ముడిపడిన ఎమోషన్స్‌,  హీరోయిన్‌ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేసిన విధానం ఎంతో బాగుంది.  

ఈ సినిమా చూస్తున్నంత సేపు ఓ మంచి  సినిమా చూస్తున్నం అనే ఆనందం సినిమా చూసే ప్రేక్షకుడికి మనసుకి కలుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి కూడా ఎక్కడా కూడా సినిమాను డ్రాప్‌ అవ్వకుండా దర్శకుడు వెంకీ అట్లూరి డీల్‌ చేసిన విధానం ప్రశంసనీయం. 'కోపం, ద్వేషం కూడా కొంతకాలం తరువాత అలిసిపోతాయి' వంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. చాలా చోట్ల దర్శకుడు వెంకీ అట్లూరిలో త్రివిక్రమ్‌ గారి శైలి కనిపించింది. ముఖ్యంగా డ్రైవర్‌ ముత్తుస్వామి, ఆయన కొడుకుతో ఓ టీవీ ఛానెల్‌ ఇంటర్వ్యూలో సూర్య మాట్లాడిన విధానం, అంజలీ దేవి (రవీనా టాండన్‌) ఆమె కూతురు తల్లిదండ్రులతో ముడిపడిన సన్నివేశాలు ,అందరిని కంటతడి పెట్టిస్తుంది. ఇలాంటి ఎమోషన్‌ సన్నివేశాలు ఈ సినిమాలో అందరి హృదయాలకు హత్తుకోవడమే కాదు ఆలోచింపజేస్తాయి. ఈ సినిమాలో సూర్య మాస్‌ ఫ్యాన్స్‌ కోసం పెట్టిన యాక్షన్‌ ఏసిపోడ్స్‌ కూడా ఎంతో క్లాస్‌గానే ఉంటాయి. సినిమా ముగింపు కూడా ఎంతో క్లాస్‌గానే ఉంటుంది. 

సంజయ్‌గా హీరో సూర్య ఎంతో స్టయిలిష్‌గా కొత్త లుక్‌లో కనిపించాడు. సంజయ్‌ విశ్వనాథ్‌ పాత్రకు ఆయన వల్ల ఎంతో హుందాతనం వచ్చింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన వయసును కనిపించకుండా దాచాలనే తాపత్రయం కూడా ఎక్కడా కనిపించదు. ఆయన నటన కొన్ని ఎమోషన్స్‌ సీన్స్‌ల్లో అందరిచేత భావోద్వేగానికి గురిచేసింది. ఇక ఈ సినిమాకు మరో హీరో మమిత బైజు ఆమె ఎనర్జీ, నటన ఈ సినిమాకు మరో బిగ్గెస్ట్‌ ప్లస్‌ పాయింట్‌. ఆ పాత్రను దర్శకుడు చాలా చక్కగా డిజైన్‌ చేశాడు. ఆమె నటన కూడా ఎంతో నేచురల్‌గా అనిపించింది. కథానాయకుడి తల్లిగా రాధికా శరత్‌కుమార్‌ నటన ఆకట్టుకుంది.సునీల్‌ రెడ్డి, రవీనా టాండన్‌, నాజర్‌ తదితరులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. జీవీ ప్రకాష్‌ కుమార్‌ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ఎమోషనల్‌ కంటెంట్‌ అనే ఫీల్‌ను కలిగిస్తుంది. ఫోటోగ్రఫీ ప్రతిభతో విజువల్స్‌ ఎంతో ప్లెజెంట్‌గా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ఈ మధ్య కాలంలో వచ్చిన వచ్చిన హార్ట్‌ టచ్చింగ్‌ క్లీన్ ఫ్యామలీ ఎంటర్ టైనర్‌ ఇది. ఒకవైపు ఎంటర్‌టైన్‌ చేస్తూనే మరో వైపు అందరి హృదయాలకు హత్తుకునే కథ, కథనాలతో సినిమా ఆద్యంతం అలరిస్తుంది. తప్పకుండా అందరూ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా.! 

 








Movie Details

Movie Name: Vishwanath And Sons

Genre: Comedy

Release Date: 2026-08-14

Cast: Suriya, Mamitha Baiju, Radhika Sarathkumar, Raveena Tandon

Director: Venky Atluri

PRO: venu gopal

Music: GV Prakash Kumar

Banner: Sithara Entertainments, Fortune Four Cinemas

Review By: Maduri Madhu

Vishwanath And Sons Rating: 3.00 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Vishwanath And Sons Trailer

More Movie Reviews