ఆదిలాబాద్ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్

ఆదిలాబాద్ లో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్. 

 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి, ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రధాని మోదీకి అఖండ స్వాగతం పలుకుతున్నాం

  విభజన హామీ మేరకు NTPC 4వేల మెగావాట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటే.. గత ప్రభుత్వం ధోరణితో కేవలం 1600 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. 

 మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని అనుమతులు ఇస్తాం.. 

 ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రాంతంలో వెలుగులు నిండనున్నాయి. 

 రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదు.. 

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం మంచిది కాదు.. సహృద్భావ వాతావరణం ఉండాలి 

 అందుకే రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసాం 

 స్కై వేల ఏర్పాటు, టెక్స్ టైల్స్ ఏర్పాటు విషయంలో ప్రధాని సానుకూలంగా స్పనందించినందుకు కృతజ్ఞతలు 

 రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నవారి పట్ల మా ప్రభుత్వం గౌరవప్రదంగా వ్యవహరిస్తుంది. 

 హైదరాబాద్ మెట్రో, మూసీ నదీ పరివాహక అభివృద్ధికి సహకరించాలని ప్రధానిని కోరుతున్నా 

 సెమీ కండక్టర్ ఇండస్ర్టీ ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి విజ్ఞప్తి చేస్తున్నా 

 కేంద్ర ప్రభుత్వంతో మా ప్రభుత్వం వైరుధ్యం పెట్టుకోదు

 కేంద్ర రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగలన్నదే మా విధానం 

 రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఉండాలని ప్రధానిని కోరుతున్నా.


       

More Press News