టీడీఆర్ బ్యాంకును ప్రారంభించిన మంత్రి కేటీఆర్
టీడీఆర్ సర్టిఫికేట్ల వినియోగ పరిధిని హెచ్.ఎం.డి.ఏలోని ఓ.ఆర్.ఆర్ వరకు పెంచిన ప్రభుత్వం
హెచ్.ఎం.డి.ఏలోని ఓ.ఆర్.ఆర్ వరకు టి.డి.ఆర్ సర్టిఫికేట్ల వినియోగ పరిధిని పెంచిన ప్రభుత్వం
>>టి.డి.ఆర్ బ్యాంకు అప్లికేషన్ కొరకు వెబ్ లింక్ http://tdr.ghmc.telangana.gov.in:8080/ {GHMC-Home page-online services-Transfer of Development Rights (TDR) సంప్రదించండి!
TDR Bank ను తెలంగాణ మున్సిపల్, ఐ.టీ శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్ల విస్తరణ, నాలా, లేక్స్, చెరువుల అభివృద్ధి పనులకు భూసేకరణ చట్టం క్రింద సేకరించిన భూములకు సంబందించిన యజమానికి జారీ చేసిన TDR సర్టిఫికెట్స్ డిమాండ్ పెంచి వినియోగించుటకు, విక్రయించుటకు TDR అప్లికేషన్ ను జిహెచ్ఎంసి రూపొందించింది. MCHRD లో ghmc, hmda ప్లానింగ్ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పుర పాలక ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జిహెచ్ఎంసి కమీషనర్ డి.ఎస్. లోకేష్ కుమార్, హెచ్.ఎం.డి.ఏ ప్లానింగ్ డైరెక్టర్ విద్యా సాగర్, జిహెచ్ఎంసి సిసిపి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సమావేశపు ముఖ్యాంశాలు:
2000 సంవత్సరంలో టి.డి.ఆర్ ను ప్రవేశపెట్టినప్పటికీ 2017 వరకు భూ యజమానుల నుండి ఆశించిన స్పందన లభించలేదు.
2017 డిసెంబర్‌లో ప్రకటించిన నూతన టి.డి.ఆర్ ఉత్తర్వుల ప్రకారం మాస్టర్ ప్లాన్ క్రింద రోడ్ల వెడల్పుకు సేకరించే భూములకు 400 శాతం, సరస్సులు, నాలాలు, ఇతర నీటి వనరుల సంరక్షణ అభివృద్దికి సేకరించే భూములకు 200శాతం టి.డి.ఆర్‌ను పెంచడం జరిగింది.
నూతన టి.డి.ఆర్‌తో జిహెచ్ఎంసి ఎస్.ఆర్.డి.పి కింద చేపట్టిన పనులు, లింక్ రోడ్లు, మిస్సింగ్ లింక్ రోడ్ల అభివృద్ది పనుల భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. యజమానులతో సంప్రదించి టి.డి.ఆర్‌లను జారీచేయడం వలన జిహెచ్ఎంసికి ఆర్థిక భారం కూడా తగ్గుతున్నది.
జిహెచ్ఎంసి ద్వారా ఇప్పటి వరకు 550 టి.డి.ఆర్ సర్టిఫికేట్లను జారీచేయడం జరిగింది. టి.డి.ఆర్ సర్టిఫికేట్లు పొందిన భూ యజమానులు ఆ సర్టిఫికేట్లను వినియోగించుకొని, నిర్మాణాలు చేపట్టుటకు లేదా సర్టిఫికేట్లను విక్రయించుటకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించుటకై జిహెచ్ఎంసి ప్రత్యేకంగా టి.డి.ఆర్ బ్యాంకును నెలకోల్పింది. టి.డి.ఆర్ సర్టిఫికేట్ల ఆన్‌లైన్ అప్లికేషన్‌ను రూపొందించింది.
అలాగే టి.డి.ఆర్ సర్టిఫికేట్లకు డిమాండ్‌ను పెంచేందుకై వాటి వినియోగ పరిధిని హెచ్.ఎం.డి.ఏ పరిధిలో ఉన్న ఓ.ఆర్.ఆర్ వరకు ప్రభుత్వం పెంచింది.
* ప్రస్తుతం టి.డి.ఆర్ సర్టిఫికేట్లను మ్యాన్వల్ పద్దతిలో జారీచేయడంతో పాటు వినియోగించడం జరుగుతున్నది.దానిని యాజమన్యానికి సౌలభ్యంగా ఉండేందుకై ఆన్‌లైన్ ఆప్లికేషన్ ద్వారా వినియోగించుకునేందుకు జిహెచ్ఎంసి ప్రత్యేకంగా టి.డి.ఆర్ బ్యాంకు అప్లికేషన్‌ను అభివృద్ది చేసింది.
ఆన్‌లైన్ టి.డి.ఆర్ బ్యాంకు అప్లికేషన్‌లో జారీచేసిన టి.డి.ఆర్ సర్టిఫికేట్ల వివరాలు, అందుబాటులో ఉన్న టి.డి.ఆర్ సర్టిఫికేట్ల సమాచారం లభిస్తుంది.
టి.డి.ఆర్ సర్టిఫికేట్‌దారులు తమకు గతంలో మ్యాన్వల్ జారీచేసిన సర్టిఫికేట్లను డిజిటల్ పద్దతిలోకి మార్చుకోవచ్చు, తదుపరి టి.డి.ఆర్ డిజిటల్ సర్టిఫికేట్లను డిమాండ్‌కు అనుగుణంగా విక్రయించుకోవచ్చు.
పౌరులు కూడా అందుబాటులో ఉన్న టి.డి.ఆర్ సర్టిఫికేట్ల గురించి టి.డి.ఆర్ బ్యాంకు నుండి తెలుసుకోవచ్చు, ఆన్‌లైన్ టి.డి.ఆర్ బ్యాంకు అప్లికేషన్ కొరకు వెబ్ లింక్ http://tdr.ghmc.telangana.gov.in:8080/ {GHMC-Home page-online services-Transfer of Development Rights (TDR)
* పౌరులు టి.డి.ఆర్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కు వెళ్లి నోటిపికేషన్ పేజిలో టి.డి.ఆర్ సర్టిఫికేట్ హోల్డర్స్‌ను గుర్తించి, టి.డి.ఆర్‌లను తమ అవసరానికి కొనుగోలు చేయవచ్చు.టి.డి.ఆర్ సర్టిఫికేట్ దారులకు, సర్టిపికేట్ల కొనుగోలుదారులకు టి.డి.ఆర్ బ్యాంకు వెసులుబాటు కల్పిస్తుంది.