రామ్ కార్తీక్ హీరోగా ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్ రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’ నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన ‘ఎన్నెన్నో..’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్

యువ క‌థానాయ‌కుడు రామ్ కార్తీక్, క‌శ్వి జంట‌గా రూపొందుతోన్న చిత్రం ‘వీక్ష‌ణం’. ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై మ‌నోజ్ ప‌ల్లేటి ద‌ర్శ‌క‌త్వంలో పి.ప‌ద్మ‌నాభ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లై ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘ఎన్నెన్నో...’ అనే లిరికల్ సాంగ్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ప్రేయ‌సి ప్రేమ‌లో మునిగిన ప్రేమికుడి మ‌న‌సు ఎలా ఉంటుంద‌నే విష‌యాన్ని చెప్పేలా ఈ సాంగ్ ఉంది.

స‌మ‌ర్థ్ గొల్ల‌పూడి సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాట‌ను రెహ్మాన్ రాయ‌గా.. ప్ర‌ముఖ సింగ‌ర్ సిద్ శ్రీరామ్ ఆల‌పించారు. యూత్‌కు క‌నెక్ట్ అయ్యేలా సాంగ్ క‌ల‌ర్‌ఫుల్‌గా ఉంది. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ కూడా సిద్ధమైంది. సాయిరామ్ ఉద‌య్ సినిమాటోగ్ర‌ఫీ  అందిస్తున్నారు. త్వ‌ర‌లోనే సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌ను అందిస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

న‌టీన‌టులు:

రామ్ కార్తీక్, కశ్వి త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

బ్యానర్ : పద్మనాభ సినీ ఆర్ట్స్, నిర్మాత : P. పద్మనాభ రెడ్డి, దర్శకుడు : మనోజ్ పల్లేటి, సినిమాటోగ్రఫీ : సాయి రామ్ ఉదయ్ (D.F Tech), సంగీత దర్శకుడు : సమర్థ్ గొల్లపూడి, ఎడిటింగ్ : జెస్విన్ ప్రభు, పి.ఆర్‌.ఒ:  నాయుడు సురేంద్ర కుమార్‌- ఫ‌ణికందుకూరి (బియాండ్ మీడియా).

More Press News