కరోనాపై వరంగల్ నిట్ శాస్త్రవేత్తల పోరు అభినందనీయం: వినోద్ కుమార్

  • తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ 
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కోవిడ్-19 పై వరంగల్ నిట్ శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా సాగిస్తున్న పోరు అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ లోని నిట్ ( National Institute of Technology.. NIT ) కేంద్రాన్ని వినోద్ కుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా నిట్ డైరెక్టర్ ఎన్. వీ. రమణా రావు, పలువురు ప్రొఫెసర్ లతో వినోద్ కుమార్ వివిధ అంశాలపై చర్చించారు.

కోవిడ్-19 పై పరిశోధనలకు ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తల బృందంలో వరంగల్ నిట్ కి చెందిన బయో టెక్నాలజీ శాస్త్రవేత్తలు డా. సౌమ్య లిప్సా రత్, డా. కిశాంత్ కుమార్ లకు ప్రముఖ స్థానం లభించడం పట్ల వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. కోవిడ్-19 దృష్ట్యా ఉష్ణోగ్రత ప్రభావాన్ని నియంత్రించేందుకు, పరమాణు ఆర్ద్రతను లెక్కించడం వంటి పరిశోధనల బాధ్యతలను శాస్త్రవేత్తలు కొనసాగిస్తున్నట్లుగా వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ స్థాయి అత్యున్నత శ్రేణి పది యూనివర్సిటీలలో  వరంగల్ నిట్ కి చెందిన శాస్త్రవేత్తలకు చోటు లభించడం తెలంగాణకు గర్వకారణమని వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ స్థాయి సంస్థలు ఎంఐటీ, పిట్స్ బర్గ్, ఇల్లినోస్ యూనివర్సిటీలు, నాసా, ఐబీఎం, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో కలిసి ఈ శాస్త్రవేత్తలు పరిశోధనలలో పాలుపంచుకుంటారని వినోద్ కుమార్ వివరించారు.

More Press News