జీలుగు వృక్షం గీత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మేడ్చెల్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో కొంపల్లి మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన
జీలుగు వృక్షము గీత కార్యక్రమంలో రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలిసారిగా జీలుగు వృక్షం ద్వారా నీరాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదిగా అందించారు. ఈ జీలుగు వృక్షం నాటిన 6 సంవత్సరాలనుండి నీరాను అందిస్తుందన్నారు. ఒక్కో జీలుగు వృక్షం రోజుకు 40 నుండి 50 లీటర్ల వరకు నీరాను అందిస్తుందన్నారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గీత వృత్తిని ప్రోత్సహించడం కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రకటించారన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం నీరా పాలసీని ప్రకటించి గౌడ్ ల ఆత్మ గౌరవాన్ని పెంచారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

ఎన్నో వందల సంవత్సరాల నుండి గీత వృత్తిదారులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, ఔషధ గుణాలు గల నీరాను సేకరించి ప్రజల కు అందిస్తున్నారన్నారు. దేవతలు సైతం సురాపానకంగా సేవించారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సైతం నీరాలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నారు. నీరాలో ఉండే ఔషధ గుణాల వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో నీరా పాలసీని ప్రవేశపెట్టి గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి అధ్యక్షులు అంబాల నారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, జీలుగు వృక్షం ద్వారా నీరాను అభివృద్ధి చేస్తున్న విష్ణు స్వరూప్ రెడ్డి, అశ్విత్ రెడ్డి, సైయింటిస్ట్ సురేష్ రెడ్డి, ప్రభాకర్ గౌడ్, సాయి కృష్ణ, ప్రవీణ్, సంతోష్, సత్యం గౌడ్, ధర్మరాజు, ఈతముల్లు ప్రసాద్ లతో పాటు మేడ్చెల్ జిల్లా మేడ్చెల్ జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ ES గణేష్ గౌడ్, అరుణ్ కుమార్, CI లు వెంకటేశం, సహదేవ్, జీవన్ కిరణ్ మరియు సిబ్బంది కృష్ణ గౌడ్, సుధాకర్, రాజు, రాజీ రెడ్డి పాల్గొన్నారు.


More Press News