హోటల్ అసోసియేషన్ ప్రతినిధులతో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భేటీ
రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని హైదరాబాద్ లో రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ -19 నేపథ్యంలో హోటల్ పరిశ్రమ పడుతున్న ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు. హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు అశోక్ హేమారాజని, రెజినాల్డ్ కార్బెట్, థామస్ అబ్రాహాములు పాల్గొన్నారు.