ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన విజయవాడ మేయర్, కమిషనర్
విజయవాడ: స్పందనలో వచ్చిన అర్జీలు నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధికారులకు సూచించారు. సొమవారం నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మేయర్, నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ (ఐ.ఏ.ఎస్) ఉన్నతాధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కారించేలా చూడాలని ఆదేశించారు.
కార్యక్రమములో పట్టణ ప్రణాళిక -11, యు.సి.డి – 7, ఇంజనీరింగ్ – 3, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) – 2, ఉద్యానవన శాఖ – 1, ఎస్టేట్ – 1, పబ్లిక్ హెల్త్ – 1 మొత్తం అర్జీలు స్వీకరించిన్నట్లు వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. కోవిడ్-19 కట్టడి చర్యలో భాగంగా ఫివర్ సర్వే నిర్వహించాలని ప్రతిరోజు, ప్రతి వాలంటిరు వారి పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి లక్షణాలు గల వారిని గుర్తించి ప్రతిరోజు నివేదికలు సమర్పించాలన్నారు.
సమావేశంలో అదనపు కమిషనర్ (జనరల్) డా.జె.అరుణ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) యు.శారద దేవి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, ఎస్టేట్ ఆఫీస్ డా.ఏ.శ్రీధర్, ఏ.డి.హెచ్. జె.జ్యోతి, తదితరులు ఉన్నారు.