ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను సందర్శించిన వీఎంసీ కమిషనర్
విజయవాడ: ఘన వ్యర్థాలను ప్రాసెస్ చేయడానికి, దాని నుండి వనరులను తిరిగి పొందడానికి నగర పాలక సంస్థ పరిధిలో నిర్వహిస్తున్న సింగ్ నగర్ నందలి ఇంటిగ్రేటెడ్ మునిసిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ను నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ బుధవారం అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ప్లాంట్ ల యొక్క పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలో అన్ని ప్రాంతాలలో రోడ్లు వెంబడి గల సి అండ్ డి వేస్ట్ మెటీరియల్ తొలగించాలని సూచించారు. ప్లాంట్ నందలి ఎండ్ టు ఎండ్ రోడ్లు, డ్రెయిన్స్ నిర్మాణానికి అవసరమైన అంచనాలు రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.
సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కమిషనర్
అవినీతికి, వివక్షతకు తావు లేకుండా పరిపాలన అన్నది ప్రజలకు చేరువా కావానల్న ప్రధాన ఉద్దేశంతో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారని నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. బుధవారం ముత్యాంపాడు, పసుపుతోట మధురానగర్ తదితర ప్రాంతాల్లో 207, 208, 211 సచివాలయలను కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపు 500 సేవలను సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి ముంగిటకే అందించడంలో ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ..ఆరోగ్యం కానీ.. రెవెన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. వ్యవసాయం కానీ.. ఉద్యానవనాలకు సంబంధించిన సమస్యలు కానీ.. మార్కెంట్ కానీ.. పశు సంరక్షణ కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంట్లోనే సమస్యను పరిష్కరిస్తారన్నారు. ప్రజల కోసం ఏర్పాటు సచివాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పర్యటనలో ఎస్.ఇ (ప్రాజెక్ట్స్) పి.వీ.కె భాస్కరరావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతభాయి, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటేశ్వర రావు మరియు ఇతర అధికారులు సిబ్బంది సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.