ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరం: విజయవాడ మేయర్
- మహిళల రక్షణ కోసం దిశ యాప్
యం.జె నాయుడు హాస్పటల్ 35వ వార్షికోత్సవాల సందర్బంగా గురువారం జ్యోతి కన్వెన్షన్ హాలు నందు ఏర్పాటు చేసిన కార్యక్రమములో మేయర్ రాయన భాగ్యలక్ష్మి ముఖ్య అతిధిగా పాల్గొనారు. అక్టోబర్ 2,3 తేదిలలో జరుగనున్న కళాశాలల విద్యర్దినులకు మహిళా భద్రతా వకృత్వo దిశ యాప్ పై స్కిట్స్ పోటీలను మేయర్ ప్రారంభిస్తూ, ఏటా యం.జె.నాయుడు హాస్పటల్ తమ వార్షికోత్సవాలలో భాగంగా ఒక సామాజిక సమస్యపై అవగాహనకు కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని అన్నారు. దిశ యాప్ పై అవగాహాన కొరకు యం.జె.నాయుడు హాస్పటల్ యాజమాన్యం చేస్తున్న కృషి అభినందనీయమని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ప్రశంసించారు. ఈ పోటీలలో నగరానికి చెందిన 30 కళాశాలలనుండి వచ్చిన విద్యార్ధినులు వకృత్వo, స్కిట్స్ పోటీలలో పాల్గొని తమ ప్రతిభా పాటవాలు చాటుకున్నారు.
ఈ కార్యక్రమoలో డా.యం.జె.నాయుడు, ఆయన సతీమణి మాధవి హాస్పటల్ సిబ్బంది పాల్గొన్నారు. సభకు హాస్పటల్ గౌరవ అధ్యక్షులు వావిలాల రజనీకాంత్ శర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా పాఠశాలల విద్యార్ధిని విద్యార్దులకు అదే విషయమై చిత్ర లేఖనంలో పోటీలు జరిగాయి. విజేతలకు వార్షికోత్సవ వేదికపై ఆకర్షిణీయమైన బహుమతులు ప్రదానం జరుగుతుoదని వివరించారు.
అక్టోబర్ 2న నగరంలో మాంసపు మరియు చేపల విక్రయాలు నిషేధం: నగర కమిషనర్ ప్రసన్న వెంకటేష్
అక్టోబర్ 2వ తేదిన గాంధీ జయంతి సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జాతీయ దినముగా ప్రకటించి సెలవు మంజూరు చేయడం జరిగింది. గాంధీ జయంతి రోజు నగరపాలక సంస్థ కబేళా సెలవు ప్రకటించుట జరిగిందని నగర కమీషనర్ ప్రసన్న వెంకటేష్ తెలియజేశారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని చికెన్, మటన్ మరియు చేపల మార్కెట్లకు కూడా సెలవు ప్రకటించడమైనది. నగరపాలక సంస్థ నిబందనల ప్రకారం ఎవరు కూడా ఏవిధమైన నాన్ వెజ్ మరియు చేపల విక్రయాలు అమ్మకూడదని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ ఆదేశాలను పాటించకుండా ఎవరైనా నగరంలో మాంసపు విక్రయాలు సాగించిన యెడల అట్టి వారిపై చర్యలు తీసుకోవటం జరుగుతుందని, నిబందనలను ఉల్లఘించిన యెడల అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తిసుకోనుటతో పాటుగా వారి షాప్ లైసెన్స్ రద్దు పరచుట జరుగుతుందని హెచ్చరించారు.