రోజువారీ జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలి: తెలంగాణ గవర్నర్

  • రాజభవన్ సిబ్బంది కోసం యోగా తరగతులను ప్రారంభించిన గవర్నర్ తమిళిసై:

రాజభవన్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాజభవన్ ప్రాంగణంలోని సంస్కృతి భవన్ లో గురువారం ఉదయం తెల్లవారుఝామున 5.30 నిముషాలకు ప్రారంభించారు. గవర్నరు దంపతులు ఇద్దరూ రాజభవన్ పరివారంతో కలిసి యోగా తరగతులలో పాల్గొన్నారు. ఉదయం 5.30 నుండి 6.30 వరకూ నిర్వహించిన ఈ యోగా తరగతులలో గవర్నర్ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్, గవర్నర్ సలహాదారుడు ఎపివియన్ శర్మ, జాయింట్ సెక్రటరీ, భవానీశంకర్, డెప్యూటీ సెక్రటరీ రఘుప్రసాద్, తదితర సుమారు 200 మంది సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.

ప్రతి రోజూ ఉదయం 5.30 నుండి 6.30 వరకూ:

యోగా తరగతులు సంస్కృతి భవన్ లో ప్రతి రోజూ ఉదయం 5.30 నుండి 6.30 వరకూ నిర్వహిస్తారని, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని గవర్నర్ కోరారు. సాంకేతికతంగా అభివృద్ది సాధించడంతో సమాజంలో చాలామంది శారీరక శ్రమను తగ్గించారని, కనీసం నడక కూడా చాలామంది మానివేశారని ఆమె అన్నారు. శరీరధారుడ్యం ప్రతీ ఒక్కరి జీవిత విధానం కావాలని, ఇందుకు ప్రతీవారు యోగాను తమ నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నరు అన్నారు. తాను ప్రతిరోజూ క్రమం తప్పక యోగా సాధన చేస్తామని గుర్తుచేశారు.

భారత ప్రధాని పిలుపు:

భారత ప్రధాని పిలుపు ఇచ్చిన ఫిట్ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా ప్రతీరోజూ ప్రతీఒక్కరం యోగా చేద్దామన్నారు. యోగా ప్రాముఖ్యతను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ, ముఖ్యంగా యువత యోగాను తమ నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నర్ పిలుపు ఇచ్చారు.

రాజభవన్ స్కూల్లో:

రాజభవన్ స్కూల్లో 6 నుండి 10 వ తరగతి వరకూ చదువుతున్న సుమారు 450 విద్యార్థులకు ప్రతీ శనివారం యోగా తరగతులు నిర్వహిస్తున్నామని, ఫిట్నెస్ పై పాఠశాల విద్యార్థుల్లో చక్కని అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించే రీతిలో రాజభవన్ స్కూల్లో యోగా తరగతులు ప్రారంభించామని అన్నారు. ప్రముఖ యోగా గురువులు, అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర యోగా కమిటీ రవి కిషోర్, ఆయన శిష్య బృందం పర్యవేక్షణలో రాజభవన్ లో యోగా తరగతులు నిర్వహిస్తున్నామని గవర్నర్ కార్యదర్శి కె. సురేంధ్ర మోహన్ తెలిపారు. 


More Press News