తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం
హైదరాబాదు, అక్టోబర్11: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్‌చంద్ర శర్మతో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, తెలంగాణ శాసన పరిషత్ చైర్మన్ భూపాల్ రెడ్డి, తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావు, జస్టిస్ షమీమ్ అక్తర్, జస్టిస్ అమర్ నాధ్ గౌడ్, జస్టిస్ అభినంద్ కుమార్ షావలి, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ వినోద్ కుమార్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర మానవహక్కుల కమీషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, పార్లమెంట్ సభ్యులు కె.కేశవరావు, బడుగుల లింగయ్య యాదవ్, బి.బి. పాటిల్, రేవంత్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్, హైకోర్ట్ రిజిష్ట్రార్ అనుపమ చక్రవర్తి, పలువురు కార్యదర్శులు, గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మీ, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్లొన్నారు.
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ హిమా కోహ్లీ ఆగస్టు 31న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆ స్థానంలో జస్టిస్ ఎం.ఎస్.ఆర్.రామచంద్రరావు తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టారు. ఇటీవల ఆయన పంజాబ్-హరియాణా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ తెలంగాణ హైకోర్టు పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.