పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న జగనన్న ప్రభుత్వం: మంత్రి వెల్లంపల్లి

  • సంఘాల వారికీ బ్యాంక్ లలో నగదు జమ
విజయవాడ: 2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా సోమవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 46 మరియు 47 డివిజన్లకు సంబందించి “V-కన్వెన్షన్ హాల్” (మిల్క్ ప్రాజెక్ట్ కళ్యాణ మండపం) నందు రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పాల్గొని 309 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 90,54,235/- చెక్కును అందజేశారు.

మంత్రి మాట్లాడుతూ వై.ఎస్. జగన్ తన పాద యాత్రలో ఇచ్చిన హామీలను వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా జగనన్న ప్రభుత్వం 4 విడతలుగా బ్యాంక్ ల వారికీ జమ చేయుట జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ మహిళలకు పెద్దపీట వేశారన్నారు. అమ్మఒడి పథకం నుంచి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళలకు అధిక ప్రాదాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం  వై.ఎస్.ఆర్.సి.పి అని అన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలోని 2829 గ్రూప్ లకు రూ. 22,02,62,631/- చెక్కులను 2వ విడత ఆసరా సంబరాలలో స్వయం సహాయక సంఘా సభ్యులకు అందించటo జరుగుతుందని పేర్కొన్నారు.

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం– కమిషనర్ ప్రసన్న వెంకటేష్

మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రణాళికాబద్దంగా కృషి చేస్తూ.. డ్వాక్రా రుణాల మంజూరు, సున్నావడ్డీ, చేతి వృత్తులకు సంబంధించి రుణాలను మంజూరు, మహిళలు వారి కాళ్లపై వారు నిలబడేలా పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఐటీసీ, రిలయన్స్, అమూల్‌ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేస్తూ వ్యాపార మార్గాలను చూపించడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుంటూ జీవనోపాధులు పెంపొందించుకోవాలని డ్వాక్రా మ‌హిళ‌ల‌కు కమిషనర్ సూచించారు. తదుపరి అతిధులు 46వ డివిజన్ నందు 134 గ్రూప్ లకు రూ. 52,40,323/- మరియు 47వ డివిజన్ నందలి 175 గ్రూప్ లకు రూ. 38,13,912/- చెక్కును అందించారు.

అదే విధంగా సెంట్రల్ నియోజక వర్గంలోని 31, 33 మరియు 36 డివిజన్ లకు సంబందించి సత్యనారాయణ పురం AKTPM హైస్కూల్ నందు శాసన సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా నందు లబ్ది పొందిన 289 గ్రూపులకు వారి రూ. 2,61,56,143/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది.

తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12, 13 మరియు 14 డివిజన్లకు సంబందించి రాజరాజేశ్వరీ కళ్యాణ మండపం నందు నిర్వహించిన వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, స్థానిక కార్పొరేటర్లతో కలసి 517 గ్రూపులకు రూ. 6,27,12,983/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది.

కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ ప్రాజెక్ట్ అధికారి డా.ఎ.శ్రీధర్, అధికారులు, యు.సి.డి సిబ్బంది, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More Press News