మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ: విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి

  • మహిళల ఆర్ధిక అభివృద్ధికి కృషి చేస్తున్న జగనన్న పభుత్వం
విజ‌య‌వాడ‌:2వ విడత వై.ఎస్.ఆర్ ఆసరా సంబరాలలో భాగంగా మంగళవారం పశ్చిమ నియోజక వర్గ పరిధిలోని 48 మరియు 49 డివిజన్లకు సంబందించి చిట్టినగర్ విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపం నందు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్థానిక కార్పోరేటర్లతో కలసి 303 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.1,83,51,931/- చెక్కును అందజేశారు.

మేయర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పాదయాత్రలో డ్వాక్వా మహిళలకు ఇచ్చిన హామీలను వై.ఎస్.ఆర్ ఆసరా పథకం ద్వారా జగనన్న ప్రభుత్వం 4 విడతలుగా బ్యాంక్ ల వారికీ జమ చేస్తుందని పేర్కొన్నారు. అమ్మఒడి పథకం, వసతి దీవెన నుంచి ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వరకు ప్రతి సంక్షేమ పథకములను అమలు చేస్తూ, మహిళలకు అధిక ప్రాదాన్యత కల్పించిన ఏకైక ప్రభుత్వం  వై.ఎస్.ఆర్.సి.పి అని అన్నారు. అదే విధంగా పాఠశాలలో బాలికలకు స్వేచ్చ్ కార్యక్రమము ద్వారా శానిటరీ నాప్కిన్స్ వంటి అనేక కార్యక్రమము చేపట్టి మహిళా పక్షపాతిగా పేరొందిన జగనన్నకు మీ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మీకు ఎటువంటి సమస్యలు ఎదురైన వెనువెంటనే మీకు నిరంతరం అందుబాటులో ఉన్న మీ కార్పొరేటర్ల దృష్టికి తీసుకువెళ్ళి సమస్యలను పరిష్కరించుకోవచ్చునని అన్నారు. రెండోవ విడత నేడు 48వ డివిజన్లో 167 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ.1,18,69,487/లు మరియు 49వ డివిజన్ నకు సంబందించి 136 స్వయం సహాయక సంఘ సభ్యులకు రూ. 64,82,444/ల చెక్కులను అందజేశారు. తదుపరి మేయర్ కార్పోరేటర్లతో కలసి కేకు కట్ చేశారు.

అదే విధంగా సెంట్రల్ నియోజక వర్గంలోని 30, 32 మరియు 57వ డివిజన్ లకు సంబందించి న్యూ ఆర్.ఆర్.పేట దేవినేని వెంకటరమణ హైస్కూల్ నందు శాసన సభ్యుడు మల్లాది విష్ణువర్ధన్, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మరియు కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. వై.ఎస్.ఆర్ ఆసరా నందు లబ్ది పొందిన 421 గ్రూపులకు వారి రూ. 4,19,19,677/-రూపాయలు చెక్కును అందించుట జరిగింది. రెండోవ విడత నేడు 30వ డివిజన్లో 213 సంఘ సభ్యులకు రూ. 2,60,06,716/లు, 32వ డివిజన్ నందు 84 సంఘ సభ్యులకు రూ. 64,17,288/లు మరియు 57వ డివిజన్లో 124 స్వయం సంఘాల వారికీ రూ.95,95,673/లు చెక్కులను అందించారు.

కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అధికారులు, యు.సి.డి సి.డి.లు, క్షేత్ర స్థాయి సిబ్బంది, వైఎస్సార్ సీపీ శ్రేణులు, పొదుపు సంఘాల మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

More Press News